Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదిగో ఇదే ఎన్‌.టి.ఆర్‌.తో లాస్ట్ డే షూట్ అంటున్న రాజ‌మౌళి

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (18:21 IST)
Rajmouli-NTR
ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి రూపొందిస్తోన్నభారీ బ‌డ్జెట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్ (ర‌ణం రౌద్రం రుధిరం)’. ఈ సినిమా షూటింగ్ చివ‌రిరోజున ఎన్‌.టి.ఆర్‌. మెడ‌లో టేగ్ వేసుకున్న స్టిల్‌తో నిల‌బ‌డ్డాడు. రాజమౌళి కుర్చీలో కూర్చుని త‌న ఆర్‌.ఆర్‌.ఆర్‌. యూనిట్ టేగ్‌ను చూపిస్తూ, ఇదే లాస్ట్ డే షూట్ అంటూ గురువారం ట్వీట్ చేశాడు. దాన్ని ఎన్‌.టి.ఆర్‌. కూడా పోస్ట్ చేశాడు. ఇందులో ఎన్నో జ్ఞాప‌కాల‌ను నెమ‌రేసుకునేలా చేసింద‌ని ఎన్‌.టి.ఆర్‌. పేర్కొన్నాడు. మ‌రోవైపు డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు కూడా ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. టోట‌ల్‌గా గ్రాఫిక్స్‌, డి.ఐ. వ‌ర్క్ ఇంకా మిగిలి వుంది. ఆ ప‌నుల్లో రాజ‌మౌళి టీమ్ వుంది. 
 
ఇక ఈ సినిమా క‌థ గురించి తెలిసిందే. భార‌తదేశ స్వాతంత్య్ర స‌మ‌ర యోధులు కొమురం భీమ్‌, అల్లూరి సీతా రామరాజు జీవితాల‌ను ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా. హైద‌రాబాద్ ప‌లు ప్ర‌దేశాల్లో భారీ సెట్స్ వేసి చిత్రీక‌రిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్‌’ ప్రేక్ష‌కుల‌ను మ‌రో కాలానికి తీసుకెళుతుంది.
 
ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్.. తెలుగు, త‌మిళ భాష‌ల‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌ను పూర్తి చేశారు. త్వ‌ర‌లోనే మిగిలిన భాష‌ల‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌ను కూడా పూర్తి చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఇంకా అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రేస్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టించారు. సుమారు. రూ.450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments