హైదరాబాద్ నగరంలోని వీఐపీలు ఉండే బంజారా హిల్స్‌లో పలు మసాజ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో ఓ సెంటరులో మసాజ్ మాటున వ్యభిచారం గుట్టుచప్పుడుకాకుండా ఉంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు వీఐపీలు క్యూకడుతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు ఈ కేంద్రంపై దాడి చేసి పలువురు అమ్మాయిలు, విటులను అరెస్టు చేశారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బంజారాహిల్స్‌లోని రోడ్ నంబరు 12లో ఉన్న మసాజ్ సెంటర్‌లో కొందరు వీఐపీలను తీసుకొచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు నిఘా విభాగం అధికారులకు సమాచారం అందింది. వారు వెస్ట్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులకు సమాచారం అందించారు.
నిఘా పెట్టిన పోలీసులు నిన్న ఆ మసాజ్ సెంటర్‌పై దాడి చేసి ఆరుగురు మహిళలు, ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు.