Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇకపై పురుషులకు కుటుంబ నియంత్రణ మాత్ర!

Advertiesment
ఇకపై పురుషులకు కుటుంబ నియంత్రణ మాత్ర!
, శుక్రవారం, 6 ఆగస్టు 2021 (13:52 IST)
పురుషుల కోసం తొలిసారిగా కుటుంబ నియంత్రణ మాత్ర (Tablet) త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ దిశగా సాగుతున్న పరిశోధనలకు వితరణశీలి బిల్‌ గేట్స్‌ అందించే నిధులు తోడ్పడనున్నాయి. ఈ పరిశోధన కోసం బిల్ గేట్స్ ఫౌండేషన్ వచ్చే రెండేళ్లలో 17 లక్షల డాలర్లను ఆయన అందించంది. 
 
కండోమ్‌ అభివృద్ధి తర్వాత పురుషుల కోసం కుటుంబ నియంత్రణ సాధనాలేవీ రూపొందలేదని స్కాట్లాండ్‌లోని దుండీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త క్రిస్‌ బారాట్‌ తెలిపారు. ఫలితంగా అవాంఛిత గర్భాల నుంచి రక్షణ భారం ఎక్కువగా మహిళలపైనే పడుతోందన్నారు. 
 
ఈ అసమానత్వాన్ని తాము సరి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. రెండేళ్లలోగా పురుషుల కుటుంబ నియంత్రణకు అనువైన మాత్రను కొనుగొని, మొదటి దశ ప్రయోగాల దశకు చేరుకుంటామన్నారు. 
 
ప్రస్తుతం పురుష కుటుంబ నియంత్రణ మాత్రల అభివృద్ధిలో అనేక అవరోధాలు ఉన్నాయి. ఒకటి.. వీర్య కణ జీవశాస్త్రంపై శాస్త్రవేత్తలకు పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం. రెండు.. వీర్య కణంలో కీలక విధులకు తోడ్పడే ముఖ్య ప్రొటీన్‌ను గుర్తించే అధ్యయనాలు జరగకపోవడం. మూడోది.. ప్రస్తుతమున్న అనేక రసాయనాలు, ఔషధాల ప్రభావాన్ని స్క్రీన్‌ చేసే సమర్థ వ్యవస్థ లేకపోవడం.
 
ఈ ఇబ్బందులను అధిగించడానికి దుండీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చిన్నపాటి, సమాంతర పరీక్ష వ్యవస్థను అభివృద్ధి చేశారు. అందులో వేగవంతమైన మైక్రోస్కోపు, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ సాధనాలు ఉంటాయి. అవి మానవ వీర్య కణాల వేగవంతమైన కదలికలను అత్యంత కచ్చితత్వంతో గుర్తిస్తాయి. తద్వారా ఔషధాల సమర్థతను కొలవడానికి వీలవుతుందని ఆ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెట్రోస్పెక్టివ్‌ ట్యాక్స్‌ కథ కంచికి : లోక్‌సభలో సవరణ బిల్లు