డబ్బింగ్ జరుగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ త్వరలో రెండవ షెడ్యూల్ ప్రారంభం

Webdunia
సోమవారం, 3 జులై 2023 (09:46 IST)
Ustad working still
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలిసి 'గబ్బర్ సింగ్' కంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అందించడానికి పని చేస్తున్నారు. డెడ్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పవన్ డబ్బింగ్ చెపుతున్నారు. 
 
ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, అతని టీం నెక్స్ట్ షెడ్యూల్ కోసం భారీ సెట్‌ను నిర్మించారు. అక్కడ పవన్ కళ్యాణ్, ఇతర తారాగణంపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రెండవ షెడ్యూల్ ప్రారంభానికి ముందు మేకర్స్ కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ని విడుదల చేశారు.
 
పవన్ కళ్యాణ్ విభిన్నమైన గెటప్‌లలో కనిపిస్తున్నారు. ఖాకీ యూనిఫాంలో డాషింగ్ గా కనిపిస్తుండగా, ఇతర స్టిల్స్‌లో తన స్వాగ్ తో ఆకట్టుకున్నారు. హరీష్ శంకర్, పవర్ స్టార్‌తో సన్నివేశాలను చర్చిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
 
ఇన్నాళ్లూ ఇద్దరి మధ్య పెరిగిన బంధాన్ని ఈ పోస్టర్లన్నీ చూపిస్తున్నాయి. మరో సారి పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేయడం హరీష్‌కి మరో పెద్ద అవకాశం, ఈ విజయవంతమైన కాంబినేషన్‌లో సినిమా చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, అశుతోష్ రానా, నవాబ్ షా, కెజిఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్,  టెంపర్ వంశీ సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు.
 
ఈ చిత్రం కోసం అగ్రశ్రేణి సాంకేతిక బృందం పని చేస్తోంది. అయనంక బోస్  సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా, ఛోటా కె ప్రసాద్‌ ఎడిటర్ గా పని చేస్తున్నారు. జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, పుష్ప, రంగస్థలం వంటి హిట్ చిత్రాల స్వరకర్త దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరస్తున్నారు.  
 
యాక్షన్ సన్నివేశాలకు స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ యేడాది వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి వంటి హిట్‌లను అందించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో సక్సెస్ ఫుల్ రన్‌ను కొనసాగించడానికి సిద్ధంగా ఉంది.
 
తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, అశుతోష్ రానా, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

15 అడుగుల కింగ్ కోబ్రాను ఎలా పట్టేశాడో చూడండి (video)

తన కంటే 50 ఏళ్లు చిన్నదైన మహిళకు రూ. 1.60 కోట్లిచ్చి వివాహం చేసుకున్న 74 ఏళ్ల వృద్ధుడు

Baby Boy: మైసూరు రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్ అయిన శిశువును 20 నిమిషాల్లోనే కాపాడారు.. ఎలా?

Hyderabad: ఆన్‌లైన్ బెట్టింగ్.. 18 ఏళ్ల డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య.. ఆర్థికంగా నష్టపోవడంతో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments