Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్ న‌టించిన మాచర్ల నియోజకవర్గం విడుదల తేదీ మారింది

Webdunia
సోమవారం, 9 మే 2022 (11:54 IST)
Nitin
నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం'. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నితిన్ కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు.
 
ఈ చిత్రాన్ని ముందుగా జూలై 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే కొన్ని పనులు పెండింగ్ లో వుండటం చేత సినిమా వాయిదా పడింది. ఇప్పుడు 'మాచర్ల నియోజకవర్గం' చిత్రం కొత్త విడుదల తేది ఖరారైయింది. ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే ఫెస్టివల్ కూడా ఈ చిత్రానికి కలసిరానుంది.
 
ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో నితిన్ లుక్ ఆకట్టుకుంది. బ్లూ జీన్స్ వైట్ షర్టులో టక్ చేసుకొని హాండ్స్ ని పోల్డ్ చేస్తున్న స్టిల్ లో నితిన్ సాలిడ్‌ గా కనిపించారు. స్టయిలీస్‌గా కనిపిస్తూనే మాస్ యాక్షన్ లుక్స్ తో దూకుడు చూపించారు నితిన్.
 
ప్రస్తుతం ఈ చిత్రంలోని పాటలని ఇటలీ, ఆస్ట్రియాలోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు.
 
నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ కు  భారీ రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్, టీజర్ వీడియోలో నితిన్ మునుపెన్నడూ విధంగా డిఫరెంట్ యాక్షన్ లుక్ తో ఆకట్టుకున్నారు.
ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.
 
పొలిటికల్ నేపధ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments