Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిఖిల్ పాన్ ఇండియా మూవీ స్పై

Advertiesment
Nikhil Siddharth
, గురువారం, 21 ఏప్రియల్ 2022 (12:57 IST)
Nikhil Siddharth
హీరో నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా గూడాచారి, ఎవరు, హిట్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఎడిటర్ గా చేసిన గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై చరణ్ తేజ్ ఉప్పలపాటి సిఈఓగా నిర్మాత కె. రాజ శేఖర్ రెడ్డి ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రంలో నిఖిల్ పాత్రకు తగట్టు 'స్పై 'అని టైటిల్ ఖరారు చేసింది చిత్ర యూనిట్. టైటిల్ పోస్టర్ డిజైన్ చాలా ఆసక్తికరంగా వుంది. గన్‌లు, బుల్లెట్‌లు, స్నిపర్ గన్ స్కోప్‌తో పాటు టైటిల్ లెటర్‌ని గన్ సేఫ్ లో సాలిడ్ గా డిజైన్ చేశారు. టైటిల్ పోస్టర్ లో నిఖిల్ లుక్ స్టన్నింగా వుంది.  బ్లాక్ టీ-షర్ట్, బ్లాక్ జాకెట్, బ్లాక్ కార్గో ప్యాంట్, క్లాసిక్ ఏవియేటర్స్ ధరించి, చేతిలో గన్ తో సూపర్ స్టైలిష్‌ 'స్పై' గా కనిపించారు నిఖిల్. అందరి ద్రుష్టిని ఆకర్షించిన ఈ టైటిల్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
 
సరికొత్త గెటప్, పాత్రలో కనిపించనున్న 'స్పై' ని నిఖిల్ తొలి పాన్ ఇండియా చిత్రంగా నిర్మాతలు భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 2022 దసరాకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
 
నిర్మాత కె రాజ శేఖ‌ర్ రెడ్డి ఈ చిత్రానికి క‌థ అందించ‌గా, బిహెచ్ గ్యారీ ఎడిటింగ్ భాద్యతలు కూడా నిర్వహిస్తున్నారు. పూర్తి యాక్షన్‌తో కూడిన స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తోంది.
 
ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్ జూలియన్ ఎస్ట్రాడా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కాగా, ఓ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేశారు.  శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా అర్జున్ సూరిశెట్టి , ప్రొడక్షన్ డిజైనర్ గా రవి ఆంథోని పని చేస్తున్నారు.
 
ఎడ్ ఎంటర్టైన్మెంట్స్ సిఈవోగా చరణ్ తేజ్ ఉప్పలపాటి ఈ ప్రాజెక్ట్ మొత్తం ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో పాటు ఈ ఏడాది మరో 2 ప్రాజెక్ట్ లు రూపొందించేందుకు ఎడ్ ఎంటర్టైన్మెంట్స్ సన్నాహాలు చేస్తుంది. ఇందులో ఒకటి డీజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో ఉండబోతుంది.
 
తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, అభినవ్‌ గోమతం, సన్యా ఠాకూర్, జిషు సేన్‌గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ తదితరులు
 
సాంకేతిక విభాగం:
దర్శకత్వం, ఎడిటర్: గ్యారీ బిహెచ్
కథ, నిర్మాత: కె రాజ శేఖర్ రెడ్డి
సీఈఓ: చరణ్ తేజ్ ఉప్పలపాటి
సమర్పణ: ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
రచయిత: అనిరుధ్ కృష్ణమూర్తి
సంగీతం: శ్రీచరణ్ పాకాల
డీవోపీ: జూలియన్ ఎస్ట్రాడా
ఆర్ట్ డైరెక్టర్: అర్జున్ సూరిశెట్టి
కాస్ట్యూమ్స్: రాగా రెడ్డి, అఖిల దాసరి, సుజీత్ కృష్ణన్
ప్రొడక్షన్ డిజైనర్: రవి ఆంథోని

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు బ్రెస్ట్ కేన్సర్, కానీ...: బుల్లితెర నటి ఇన్‌స్టాలో పోస్ట్