Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌కీయాల‌కు వ‌చ్చే టైం లేదని స్ప‌ష్టంచేసిన ఎన్‌.టి.ఆర్‌.

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (18:43 IST)
NTR-twitter
చంద్ర‌బాబు హ‌యాంలో ఓసారి జూనియర్ ఎన్టీఆర్‌.ను రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చేలా ప్లాన్ చేశారు. అప్పుడు ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ పాల్గొన్నాడు. త‌ర్వాత మ‌ర‌లా వెన‌క్కి త‌గ్గాడు. సినిమాల‌వైపు దృష్టి పెట్టాడు. నాలుగేళ్ళుగా ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా కోస‌మే ప‌నిచేసిన ఆయ‌న ఇప్పుడు ప‌లు సినిమాల‌తో బిజీగా అయ్యాడు. ఈ సంద‌ర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన  ఇంటర్వ్యూలో రాజ‌కీయ అంశాల  గురించి క్లారిటీ ఇచ్చాడు. 
 
గ‌తంలోనూ ఇలాంటి ప్ర‌శ్న ఈయ‌న ముందు ఎదురైంది. గుడివాడ ఎం.ఎల్‌.ఎ. నానికి స‌పోర్ట్‌గా వున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ త‌ర్వాత సంభ‌వించిన ప‌రిస్థితుల‌వ‌ల్ల దూర‌మ‌య్యారు. చాలామంది శ్రేయోభిలాషులు ఆయ‌న్ను ఇప్ప‌ట్లో రాజ‌కీయాలలోకి రావ‌ద్ద‌నే సూచించారు. ఇప్పుడు తాజా ఈ ప్ర‌శ్న ఎదురైంది. అప్పుడు ఆయ‌న చెప్పిన స‌మాధానం ఇది. “ ప్రస్తుతం నా జీవితంలో చాలా చాలా సంతోషకరమైన దశలో ఉన్నాను. ఒక యాక్టర్ గా ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడం ప్రారంభించాను. నేను మొదట నుంచి దానికే కట్టుబడి ఉండాలనుకుంటున్నాను.

ఫ్యూచర్ అంటే ఐదేళ్లు తర్వాత, పదేళ్ల తరువాత ఉంది అని అనుకొనే మనిషిని కాను.. భవిష్యత్ అంటే నా నెక్స్ట్ సెకన్ ఏంటి అనేది ఆలోచించే మనిషిని. ప్రస్తుతం ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను.  నాకు ఎనలేని సంతృప్తినిచ్చే పని న‌ట‌న` అని తేల్చి చెప్పాడు. ఎన్‌.టి.ఆర్‌. రాజ‌కీయ ప్ర‌వేశం గురించి అప్ప‌ట్లోనే రాజ‌మౌళి సూచించాడు. అప్ప‌ట్లో క్రేజీవాల్‌కు స‌పోర్ట్‌గా ఎ.ఎ.ఎస్‌. ల‌క్ష్మీనారాయ‌ణ‌కు స‌పోర్ట్‌గా రాజ‌మౌళి నిలిచాడు. కానీ ఆయా అభ్య‌ర్థుల‌కు డిపాజిట్ కూడా ద‌క్క‌లేదు. దాంతో ఎన్‌.టి.ఆర్‌.కు రాజ‌మౌళి త‌న అనుభ‌వాల‌ను పూస‌గుచ్చిన‌ట్లు చెప్పిన‌ట్లు తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీచర్ కొట్టారంటూ టీచర్లపై ఫిర్యాదు : విద్యార్థితో పాటు తల్లిదండ్రులపై పోక్సో కేసు!

స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు కాలర్ ఐడీ సదుపాయాన్ని తీసుకొస్తున్న సర్వీస్ ప్రొవైడర్లు!

హైదరాబాద్‌లో విషాదం.. పెళ్లి కాలేదని రైలుకిందపడి వైద్యుడి ఆత్మహత్య

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments