Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రతిపక్షనేత చంద్రబాబు స్థలం కబ్జా చేసారు, ఎక్కడ?

Advertiesment
ప్రతిపక్షనేత చంద్రబాబు స్థలం కబ్జా చేసారు, ఎక్కడ?
, శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (19:39 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కబ్జాకోరులు రెచ్చిపోతున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. అధికార పార్టీ నేతలు, వారి అండతోనే కబ్జా యదేచ్ఛగా సాగిపోతుందంటుని గగ్గోలు పెడుతున్నారు. అయితే ఏకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్థలాన్నే కబ్జా చేసేశారట.


చిత్తూరు జిల్లాలోని చంద్రబాబునాయుడు సొంత గ్రామం నారావారిపల్లిలో సర్వేనెంబర్ 222/5లో చంద్రబాబు పేరుతో 38 సెంట్ల భూమి ఉంది. చంద్రబాబు స్థలంలో కబ్జాకోరులు రాళ్ళను నాటి స్థలం మొత్తాన్ని కబ్జా చేయాలని ప్రయత్నించారు. 1989 సంవత్సరంలో 87 సెంట్ల రిజిస్టర్ భూమిని చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు కొనుగోలు చేశారు.

 
అయితే ఆ తరువాత ఆ భూమి చంద్రబాబు పేరిట వచ్చింది. ఆ భూమిలో కొంత భాగాన్ని ప్రజల అవసరాల కోసం కళ్యాణ మండపం, ఆసుపత్రి నిర్మాణానికి ఇచ్చారు చంద్రబాబు. మిగిలిన 38 సెంట్ల భూమి అలాగే ఉంది. అయితే నిన్న రాత్రి కొంతమంది ఆ స్థలాన్ని చదును చేసి కబ్జా చేసేశారు. దీంతో చంద్రబాబు బంధువులు... పోలీసులు, రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా ఎవరూ కూడా అటువైపుగా రాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛత్రపతి శివాజీ మహారాజ్ 392వ జయంతి 2022 .. 16వ ఏటనే..!