Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిబ్ర‌వ‌రి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా నాలుగు భాష‌ల్లో విడుద‌ల కానున్న మూన్ ఫాల్‌

Advertiesment
Moonfall
, సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (17:11 IST)
హాలీ బెర్రీ, పాట్రిక్ విల్సన్, జాన్ బ్రాడ్లీ, మైఖేల్ పెనా ప్ర‌ముఖ తారాగ‌ణంతో రూపొందిన `మూన్ ఫాల్‌` సినిమా ఫిబ్ర‌వరి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కాబోతుంది. దర్శకుడు రోలాండ్ ఎమ్మెరిచ్ సైన్స్ ఫిక్ష‌న్ సినిమాల‌ను తెర‌కెక్కిచ‌డంలో దిట్ట‌. '2012' , ది డే ఆఫ్టర్ టుమారో, ది పేట్రియాట్, మిడ్‌వే వంటి భిన్న‌మైన చారిత్రక ఇతిహాసాలు చిత్రాల‌ను రూపొందించారు. అతని స్క్రిప్ట్‌లు శక్తివంతమైన భావోద్వేగాలతో కూడిన అద్భుతమైన థీమ్‌లను కలిగి ఉంటాయి. తాజాగా రూపొందిన మూన్ ఫాల్ ప్రేక్ష‌కుల‌ను క‌నువిందు చేయ‌నుంది. $146 మిలియన్ల అంచనా బడ్జెట్‌తో మాంట్రియల్‌లో చిత్రీకరించబడింది. ఫిబ్రవరి 11, 2022న ఇంగ్లీష్, తమిళం, తెలుగు,  హిందీ భాష‌ల్లో విడుద‌కాబోతోంది.
 
Moonfall,
క‌థాప‌రంగా చెప్పాంటే,  ఒక రహస్యమైన శక్తి చంద్రుడిని దాని కక్ష్య నుండి పడవేస్తుంది.  దానిని భూమిపై ఒకదానిపైకి విసిరింది భూమితో పాటు మానవుల జీవితంతో ఢీకొనే సంద‌ర్భంగా ఏర్ప‌డిన విన్యాసాలే ఈ చిత్రం. NASA ఎగ్జిక్యూటివ్, మాజీ వ్యోమగామి జోసిండా 'జో' ఫౌలర్ (అకాడెమీ అవార్డు విజేత హాలీ బెర్రీ)  గ్రహాన్ని రక్షించగల ఆలోచనను కలిగి ఉంటాడు. ఆ త‌ర్వాత ఏమి జ‌రిగింద‌నేఇ ఆస‌క్తికరంగా వుంటుంది.
 
తారాగణం - హాలీ బెర్రీ, పాట్రిక్ విల్సన్, జాన్ బ్రాడ్లీ, మైఖేల్ పెనా, చార్లీ
ప్లమ్మర్, కెల్లీ యు, ఈమె ఇక్వాకోర్, కరోలినా బార్ట్‌జాక్ మరియు డోనాల్డ్ సదర్లాండ్
సినిమాటోగ్రఫీ- రాబీ బామ్‌గార్ట్‌నర్, సంగీతం -థామస్ వాండర్,; హెరాల్డ్ క్లోసర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సహజ నటి జయసుధకు కరోనా.. అమెరికాలో చికిత్స