Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ పోతినేని స్కంద ది ఎటాకర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (13:56 IST)
Skanda new date
బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించడంలో దిట్ట.  కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు చేయడంలో స్పెషలిస్ట్ అయినప్పటికీ తన సినిమాల్లో తగిన వినోదం, ఫ్యామిలీ డ్రామా ఉండేలా చూసుకుంటారు. బోయపాటి ‘స్కంద’ కోసం ఎనర్జిటిక్ & మాస్ ఉస్తాద్ రామ్ పోతినేనితో చేతులు కలిపారు. రాపో  హై-ఆక్టేన్ ఎనర్జీ, ఉబర్ స్టయిల్ కి చిరునామా. రామ్ ‘స్కంద’ కోసం అన్ బిలివబుల్ గా మాస్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. రాపో డిఫరెంట్  షేడ్స్‌లో కనిపిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుందని ప్రకటించారు. 
 
కానీ సాంకేతిక కారణాలతో స్కంద ది ఎటాకర్ సెప్టెంబర్ 28న థియేటర్లలో రాబోతుంది. ఈ విషయాన్నీ చిత్ర యూనిటీ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది.  రామ్ పంచెకట్టులో కనిపిస్తే, శ్రీలీల హాఫ్ చీరలో హోమ్లీగా కనిపిస్తుంది. పొలంలో కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అందమైన చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు
 
ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మొదటి రెండు పాటలు సంచలన విజయం సాధించాయి. ఫస్ట్ థండర్, టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రీ-రిలీజ్ థండర్ మరింతగా అంచనాలని పెంచనుంది.
 
 శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్,  పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెన్ను వివాదం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది... ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది..

కారులో ప్రియురాలుతో సర్పంచ్, డోర్ తీసి పిచ్చకొట్టుడు కొట్టిన భార్య (video)

డొనాల్డ్ ట్రంప్‌తో భారతీయ ఐటీకి కష్టకాలం.. వీసా ఆంక్షలు సైతం పీడకల?!

"ఫ్యూచర్ సిటీ"తో రేవంత్ రెడ్డికి తలనొప్పులు.. ఆ కల కోసం.. ఆ పని చేయకపోతే..?

ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్ మూర్తి నాయుడు ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments