Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్‌ శెట్టి కథ అనుష్క కథేనా ! దర్శకుడు మహేష్‌బాబు ఏమన్నాడు!

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (13:40 IST)
Anushka, naveen
మిస్‌ అనుష్క బాహుబలి తర్వాత చాలాకాలం నటనకు గ్యాప్‌తీసుకుంది. సోషల్‌ మీడియాలో కూడా అన్‌లాక్‌ అయింది. కొంతకాలానికి మరలా సోషల్‌మీడియాలో యాక్టివ్‌ అవుతూ పుట్టినరోజునాడు, కుటుంబంతో యాగాలు చేసిన కొన్ని ఫొటోలు పోస్ట్‌చేసి ఒక్కసారిగా యూత్‌ను డైవర్ట్‌ చేసింది. ప్రభాస్‌తో ఆమెకున్న అనుబంధంకానీ ఇతరత్రాగానీ సోషల్‌మీడియాలోనూ ఫిలిం సర్కిల్‌లోనూ హాట్‌ టాపిక్‌గా మారాయి. అలాంటి అనుష్క జీరోసైజ్‌ అనే సినిమాకోసం బాగా లావు అయి ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ఆ ఎఫెక్ట్‌ ఆమె బాడీపై విపరీతమైన ప్రభావం చూపిందని టాక్‌ కూడా వుంది.
 
ఇక ఇప్పుడు గ్యాప్‌ తీసుకుని మిస్‌శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి అనే సినిమాలో నటించింది. నవీన్‌ పోలిశెట్టి కాంబినేషన్‌ చేసింది. ఈ సినిమాలో ఆమె పాత్ర లండన్‌ నుంచి ఇండియా వచ్చిన అమ్మాయిగా వుంటుంది. ఏజ్ వచ్చినా ఆమెకు వివాహం చేసుకోవాలని లేదు. కానీ పిల్లల్ని కనాలి. ఈ కోరికతో ఓ బిడ్డను కోరుకుంటుంది. సమాజానికి తండ్రి కావాలి కాబట్టి ఆ పాత్ర నవీన్‌ పోషించాడనేది చిత్ర కథాంశం. ఈ కథ విని ఆమె చాలా ఎగ్సైట్‌ అయిందని ముందుగా ఈ సినిమాలో ఆమె స్టార్‌ కాస్ట్‌ అని ఆ తర్వాత కొంతకాలానికి నవీన్‌ తెరపైకి వచ్చాడని దర్శకుడు మహేష్‌ తెలిపారు. మరి ఈ పాయింట్‌ చూస్తే, ఏదైనా స్పూర్తిగా తీసుకున్నారా, లేదా అనుష్క వ్యక్తిగతానికి సంబంధించినది అనిపిస్తుంది అనే అనుమానం వ్యక్తం చేస్తే, అలాంటిది లేదు. కొన్ని సంఘటనలు నన్ను ఇన్‌స్పైర్‌ చేశాయి. సమాజంలో పలువురు ఇలా వుంటున్నారు. కానీ అనుష్క వ్యక్తిగతానికి దీనికి సంబంధంలేదని దర్శకుడు తెలిపారు. మరి సినిమా విడుదల తర్వాత సోషల్‌మీడియాలో ఎటువంటి కామెంట్లు వస్తాయో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

నా కుమార్తె చనిపోయింది... వరకట్న నగలు తిరిగి ఇచ్చేయండి..

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments