Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అభిమానులకు క్షమాపణలు చెప్పిన నవీన్ పోలిశెట్టి

navin polishetty
, సోమవారం, 4 సెప్టెంబరు 2023 (09:27 IST)
సినీ అభిమానులకు నటుడు నవీన్ పోలిశెట్టి క్షమపణలు చెప్పారు. మీరు మాపై చూపించే ప్రేమకు మంచి సినిమా తప్ప మరేం ఇవ్వలేమంటూ చెప్పారు. ఆయన నటించిన తాజా చిత్రం మిస్ శెట్టి... మిస్టర్ పోలిశెట్టి. చిత్రీకరణతో పాటు.. పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో నవీన్ పోలిశెట్టి క్షమాపణలు చెప్పారు. 
 
ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయింది. కానీ, సినిమా విడుదలలో తీవ్ర జాప్యం జరిగిందని అభిమానులు భావిస్తున్నారు. సినిమా జాప్యానికి కారణం పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులకు అధిక సమయం పట్టడమే అని చెప్పారు. 
 
"మీరు మాపై చూపించే ప్రేమకు మంచి సినిమా తప్ప మేం ఇంకేమీ ఇవ్వలేం. దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా ఇది. కుటుంబ ప్రేక్షకులు చూడదగ్గ మూవీ. సోమవారం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయి" అని నవీన్ తెలిపారు.
 
కాగా, ఈ నెల 7వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. సీనియర్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రను పోషించారు. పి.మహేశ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్ర బృందంతో పాటూ హీరో నవీన్ పలు నగరాలు సందర్శించి అక్కడి అభిమానులను కలుసుకున్నారు. ఆదివారం హైదరాబాద్ నగరంలో ఓ మాల్‌లో చిత్ర బృందం 'మీట్ అండ్ గ్రీట్' నిర్వహించింది. 
 
ఈ సందర్భంగా నవీన్ తనదైన శైలిలో కామెడీ పండిస్తూ అభిమానులను అలరించాడు. సినిమా విడుదలలో జాప్యం జరిగినందుకు మన్నించాలని కూడా కోరారు. నవీన్ పోలిశెట్టి చివరి చిత్రం 'జాతిరత్నాలు' 2021లో విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ ఏడో సీజన్.. బ్రీఫ్ కేస్ తొలిరోజే వచ్చేసింది.. షకీలా ఎంట్రీ