పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ ఏడో సీజన్ ఆదివారం ప్రారంభం అయ్యింది. బిగ్ బాస్ ఫైనల్ రోజున హౌస్‌లో మిగిలున్న కంటెస్టెంట్లను బ్రీఫ్ కేసులో నగదుతో ఊరిస్తుంటారు. కానీ, ఈసారి ఆ బ్రీఫ్ కేసు తొలిరోజునే వచ్చింది.
అప్పటివరకు హౌస్‌లో ప్రవేశించిన ప్రియాంక జైన్, శివాజీ, దామిని భట్ల, ప్రిన్స్ యావర్, శుభ శ్రీలను హోస్ట్ నాగార్జున టెంప్ట్ చేసే ప్రయత్నం చేశారు. రూ.5 లక్షల నుంచి మొదలు పెట్టి రూ.35 లక్షల వరకు పెంచుకుంటూ పోయారు.
ఆ బ్రీఫ్ కేసు తీసుకుని ఇప్పటికిప్పుడు వెళ్లిపోవచ్చని, అందులో ఉండే క్యాష్ వారి సొంతం అవుతుందని నాగ్ ఆఫర్ ఇచ్చారు. అయితే, కంటెస్టెంట్లు ఎవరూ ఆ బ్రీఫ్ కేసును తీసుకునేందుకు ఇష్టపడలేదు. దాంతో ఈ బ్రీఫ్ కేసును నాగ్ స్టోర్ రూమ్‌కు పంపించేశారు.
ఇక, బిగ్ బాస్ తాజా సీజన్‌లో అలనాటి శృంగార తార షకీలా కూడా ఎంటరయ్యారు. ఆమెతో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు వచ్చి వీడ్కోలు పలికారు. గత కొన్నేళ్లుగా తాను ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం కృషి చేస్తున్నానని, ట్రాన్స్ జెండర్ల సమాజంలో తనను కూడా ఆమోదించారని షకీలా వెల్లడించారు.