Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బోయపాటి శ్రీను స్కంద నుంచి సెలబ్రేషన్ సాంగ్ డుమ్మరే డుమ్మా

Skanda celebrationsong
, బుధవారం, 30 ఆగస్టు 2023 (17:10 IST)
Skanda celebrationsong
బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’-ది ఎటాకర్ విడుదలకు ముందే మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా మారుతోంది. మొదటి పాట ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ అయితే, రెండవ పాట మాస్ ఫోక్ నంబర్. ఈ రోజు, మేకర్స్  చిత్రంలోని మూడవ సింగిల్- డుమ్మరే డుమ్మా సాంగ్ ని విడుదల చేశారు.
 
ఎస్ తమన్ డిఫరెంట్ సిట్యువేషన్స్ కి డిఫరెంట్  ట్రాక్‌లను స్కోర్ చేశారు. ఇప్పుడు సెలబ్రేషన్స్  వైబ్‌లతో డుమ్మరే డుమ్మా పాటని నింపారు. ఇది పల్లె అందాన్ని,కుటుంబ సభ్యుల మధ్య గొప్ప బంధాన్ని చూపిస్తోంది. ప్రతి భావోద్వేగాన్ని, ప్రతి సందర్భాన్ని జరుపుకోవడం యొక్క ప్రాముఖ్యతను ప్రజంట్ చేస్తోంది. ఎస్ఎస్ థమన్ అందించిన ట్యూన్ లానే విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని సాహిత్యం అందించగా, అర్మాన్ మాలిక్ , అయ్యన్ ప్రణతి ఆహ్లాదకరంగా పాడారు. ఈ పాటలో రామ్, సాయి మంజ్రేకర్ తో పాటు  శ్రీకాంత్, గౌతమి , ఇతర కుటుంబ సభ్యులు కూడా సందడి చేశారు.
 
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్,  పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్  .
 
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.  
 తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్, తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబాయ్, అమ్మాయిగా భగవంత్ కేసరి లో బాలకృష్ణ, శ్రీలీల పై గణేష్ సాంగ్