Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లో ఉన్న రామ్ పోతినేని, శ్రీలీల స్కంద సింగిల్

Advertiesment
Ram Pothineni, Srileela
, శనివారం, 12 ఆగస్టు 2023 (17:33 IST)
Ram Pothineni, Srileela
బోయపాటి శ్రీను ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘స్కంద- ది ఎటాకర్‌’ రూపొందిస్తున్నారు. మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్ శ్రీలీల ఈ చిత్రం కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే చిత్ర యూనిట్ మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది.
 
ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. టైటిల్‌ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన లభించగా, థమన్ స్కోర్ చేసిన ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లో ఉంది. ఈలోగ మేకర్స్ ఆఫ్‌లైన్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఈ ఫిల్మ్  స్టాండీలు  విడుదలయ్యాయి, అన్ని చోట్ల ఏర్పాటు చేయబడ్డాయి. స్టాండీ ఇమేజస్ ఒకదానిలో రామ్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. మరొక ఇమేజ్ రామ్, శ్రీలీల రొమాంటిక్ కెమిస్ట్రీని ప్రజంట్ చేస్తోంది. యాక్షన్ పోస్టర్ మాస్‌ని ఆకట్టుకుంటే, రొమాంటిక్ పోస్టర్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పిస్తుంది.
 
ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి, సినిమా చూడాలనే క్యూరియాసిటీని మరింత పెంచడానికి రెగ్యులర్ అప్‌డేట్‌లతో ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
 
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్,  పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.
 
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టైగర్ నాగేశ్వరరావు దండయాత్ర షురూ అయింది