Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగబాబు బర్త్‌డే పార్టీకి డుమ్మాకొట్టిన పవన్ కళ్యాణ్

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (09:40 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్‌గా గుర్తింపు పొందిన నటుడు నాగబాబు. అటు నటుడుగా, ఇటు నిర్మాతగా, బుల్లితెరపై జడ్జిగా రాణిస్తున్నాడు. ఈయన పుట్టిన రోజు వేడుకలు అక్టోబరు 29వ తేదీ. అదే రోజు రాత్రి హైదరాబాద్ నగరంలోని ప్రముఖ నక్షత్ర హోటల్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మినహా మిగిలిన మెగా ఫ్యామిలీ అంతా వచ్చి సందడి చేసింది. 
 
ముఖ్యంగా, మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, తనయుడు, హీరో రామ్ చరణ్, కోడలు ఉపాసనతో పాటు హీరోలు వరుణ్ తేజ్, అల్లు అర్జున్, నిహారిక, శ్రీజ ఇకా మెగా ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. 
 
ఈ మెగా పార్టీకి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అవి అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే ఈ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీపావ‌ళి రోజు అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి మ‌రీ పండుగ జ‌రుపుకున్న ప‌వ‌న్‌.. నాగ‌బాబు బ‌ర్త్‌డే రోజు రాక‌పోవ‌డానికి కార‌ణం ఏమై ఉంటుందా అని ఆరాలు తీస్తున్నారు.
 
పైగా, పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో నాగబాబు క్రియాశీలక సభ్యుడుగా ఉన్నారు. గత ఎన్నికల్లో నర్సాపురం లోక్‌సభ అభ్యర్థిగా జనసేన తరపున నాగబాబు పోటీ చేసి ఓడిపోయారు కూడా. అంతేకాకుండా, తాను అన్నయ్య అయినప్పటికీ జనసేనలో మాత్రం ఓ సాధారణ కార్యకర్తగా ఉంటానని నాగబాబు పలుమార్లు చెప్పారు కూడా. అలాంటి నాగబాబు పుట్టినరోజు వేడుకలకు పవన్ రాకపోవడం ఇపుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్‌కు వెళ్లిన కొత్త జంట మిస్సింగ్.. ఎక్కడ?

అంత పని ఎలా చేశావ్ శంకరనారాయణన్... కారును అవలీలగా లాగిపడేస్తే ఎలా?

ఏంటి.. కోవిడ్ బెడ్ లేదా.. అయితే రోగిని చంపెయ్...

అత్యంత సాదాసీదాగా దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్న కలెక్టర్

NTR Bharosa Scheme: జూన్ 12 నుంచి అమలులోకి ఎన్టీఆర్ భరోసా పథకం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments