Webdunia - Bharat's app for daily news and videos

Install App

హంట్ ఫర్ పుష్ప కాన్సెప్ట్ ఇండియా లో రూల్ చేసింది

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (15:45 IST)
Allu arjun pupshpa
పాన్ ఇండియా సార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. పుష్ప సినిమా రికార్డుల గురించి కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులపై చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు.  పుష్ప రాజ్ అనే క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు  దర్శకుడు సుకుమార్. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ ఇన్ అసోసియేట్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.
 
పుష్పరాజ్  పాత్రలో అల్లు అర్జున్ నటించిన తీరు,  డైలాగ్ డెలివరీ,  వాయిస్ మాడ్యుకేషన్,  యాటిట్యూడ్ ఇవన్నీ తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి.  అప్పటివరకు తెలుగు, మలయాళ ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితమైన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ చేరువయ్యారు.
 
పుష్ప సినిమా ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే క్రికెటర్స్ రాజకీయ నాయకులు సినిమాల్లోని డైలాగులు తమదైన స్టైల్ లో చెబుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. పుష్ప-2 ది రూల్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రీసెంట్ గా "పుష్ప: ది రూల్"  చిత్రం యొక్క "హంట్ ఫర్ పుష్ప"  అనే కాన్సప్ట్ వీడియో  రిలీజ్ చేసింది చిత్రం  బృందం.
 
3 నిమిషాల 17 సెకన్ల నిడివి ఉన్న ఈ "హంట్ ఫర్ పుష్ప" కాన్సెప్ట్ వీడియో గూస్ బమ్స్ తెప్పించి, సినిమా మీద అంచనాలను పెంచేసింది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ కాన్సెప్ట్ వీడియో 100 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది. 3.3 మిలియన్ లైక్స్ తో ఒక అరుదైన రికార్డ్ ను సృష్టించింది. మొత్తానికి పుష్ప తరహాలోనే "పుష్ప" ను మించి "పుష్ప: ది రూల్" ప్రకంపనలు సృష్టించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US Elections 2024: కొనసాగుతున్న పోలింగ్.. కమలా హారిస్, ట్రంప్ ఏమన్నారంటే...

హైదరాబాద్‌లో ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024

సమాజ సేవ ద్వారా ఐక్యతను ప్రోత్సహిస్తున్న కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్

పవన్ కల్యాణ్ చిన్నపిల్లాడి లెక్క మాట్లాడితే ఎలా?: మందక్రిష్ణ మాదిగ

కులగణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్- రాహుల్ గాంధీ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments