Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ది హెల్మెట్ మాన్` ఏం చేశాడు!

Webdunia
ఆదివారం, 3 జనవరి 2021 (12:06 IST)
హెల్మెట్ ధ‌రించిన వ్య‌క్తి ఏంచేశాడు! అత‌ని వెనుక ఉద్దేశ్యం ఏమిటి? అన్న ఆస‌క్తిక‌ర కాన్సెప్ట్‌తో "ది హెల్మెట్ మాన్` రూపొందుతోంది. ఇటీవ‌లే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. విభిన్నమైన కథ-కథనాలతో రూపొందిన కొత్త తరహా చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు అనటానికి ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాలు ప్రూవ్ చేశాయి. అలాంటి న్యూ టైప్ ఆఫ్ సబ్జెక్టుతో డైరెక్టర్ శశాంక్ మల్లోజ్జల రూపొందించిన చిత్రమే "ది హెల్మెట్ మాన్` అని ద‌ర్శ‌కుడు తెలియ‌జేస్తున్నాడు.
 
ఎ ఫ్లయింగ్ థాట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఔట్ అండ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. కౌశిక్ అలుగూరి, మిహీర, రంగాధం వదిగేపల్లి, లక్ష్మణ్ మీసాల, స్వర్ణకాంత్ ముఖ్య పాత్రలు పోషించిన "ది హెల్మెట్ మాన్" చిత్రాన్ని తేజస్వి పుప్పాల నిర్మిస్తున్నారు.
 
కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని డిసెంబర్ 30న రిలీజ్ చేశారు. జనవరిలో టీజర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ : శ్రీ యోగి చెంబోలు, లిరిక్స్ : రెహ్మాన్, ఎడిటర్: నగ్నముని, డిజిటల్ మార్కెటింగ్: లక్కీ, పోస్ట్ ప్రొడక్షన్: డిజి పోస్ట్, పిఆరోఓ: సాయి సతీష్, నిర్మాత: తేజస్వి పుప్పాల, సినిమాటోగ్రఫీ-కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: శశాంక్ మల్లోజ్జల.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments