Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2021 చిరకాలం గుర్తిండిపోయే సంవత్సరంగా మార్చుతాం : రాజమౌళి

Advertiesment
2021 చిరకాలం గుర్తిండిపోయే సంవత్సరంగా మార్చుతాం : రాజమౌళి
, శుక్రవారం, 1 జనవరి 2021 (13:27 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రామజౌళి సినీ ప్రేక్షకులకు కొత్త సంవత్సరం రోజున ఓ హామీ ఇచ్చారు. 2021ను చిరకాలం గుర్తిండి పోయే సంవత్సరంగా మార్చేందుకు ప్రయత్నిస్తామని ట్వీట్ చేశారు. 
 
ప్రస్తుతం ఆయన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం)' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 
 
తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, ఆంధ్ర ప్రాంతానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఇద్దరు స్వాతంత్ర్య యోధులకు సంబంధించిన కల్పిత గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ను రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ అనుకుంటన్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. 
 
దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ ప్యాన్‌ ఇండియా మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచచూస్తున్నారు. ఆలియాభట్‌, అజయ్‌ దేవగణ్‌ వంటి బాలీవుడ్ స్టార్స్‌ సహా హాలీవుడ్‌ స్టార్స్‌ ఒలివియా మోరిస్‌, అలిసన్‌ డూడి, రే స్టీవెన్‌ సన్‌ ఈ చిత్రంలో నటిస్తునున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అభిజిత్‌కు సినీ ఆఫర్లు వస్తున్నాయా?