Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజ హెగ్డే, అఖిల్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంః వాసు వర్మ

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (16:42 IST)
Vasu varma
గీతా ఆర్ట్స్‌లో కథ రెడీ చేసే ప్రాసెస్‌లో బన్నీ వాసు ప్రొడక్షన్స్ చెయ్యమని ప్రపోజల్ పెట్టాడు. అప్పుడు బొమ్మరిల్లు భాస్కర్‌తో సినిమా చెయ్యాలని అనుకున్నాను. భాస్కర్ ఈ కథ చెప్పగానే నచ్చింది. వెంటనే అరవింద్ గారికి చెప్పాము ఆయనకు నచ్చిందని `మోస్ట్ ఎలిజిబుల్ బేచిల‌ర్‌`లో ఒక నిర్మాత వాసూవ‌ర్మ తెలియ‌జేస్తున్నారు.
 
సినిమాకు ఏం కావాలో నేను చేసుకుంటూ వచ్చాను. అలా దిల్ రాజ్ బ్యానర్‌లో వినాయక్ గారి దగ్గర కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ సైడ్ ఉన్నాను. టీమ్ వర్క్‌లో లోపాలు లేకుండా ఉంటే సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువగా జరగడంతో సినిమా ఎలా చెప్పాలి అనే దాని మీద క్లారిటీ వస్తుంది. 
 
భాస్కర్ చెప్పిన బొమ్మరిల్లు కథ అందరికి కనెక్ట్ అయ్యింది. ఆ ఐడియాను స్క్రీన్ మీద చెప్పాలి అనే ఆలోచనే సక్సెస్. ఇప్పుడు భాస్కర్ మరో ఫ్రెష్ పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పెళ్లి విషయంలో జరిగే కొన్ని కీలక సంఘటనలు ఆధారంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా ఉంటుంది. అన్ని అంశాలు ఈ సినిమాలు ఉన్నాయి, సినిమా అందరికి కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. 
 
అఖిల్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. పూజకి తనకు మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుది. అఖిల్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కథకు ఏం కావాలో అది ఆయన ఇచ్చాడు. నిర్మాతగా నాకు ఈ సినిమా చాలా తృప్తిని ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల వేతనం రూ.15 వేలు.. రూ.34 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు - ఐటీ శాఖ వింత చర్య!!

నిత్యానంద మృతి వార్తలు - వాస్తవం ఏంటి? కైలాసం నుంచి అధికార ప్రకటన!

రతన్ టాటా ఔదార్యం : తన ఆస్తుల్లో దాతృత్వానికే సింహభాగం

భార్యాభర్తలు కాదని తెలుసుకుని మహిళపై సామూహిక అత్యాచారం...

జీవితంలో నేను కోరుకున్నది సాధించలేకపోయాను- టెక్కీ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments