Bhaskar, aravind and others
బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలంటే జీవితాన్ని చూసినట్లుంటుంది. ఆయన జీవిత లోతుల్లోంచి కథలు రాసుకుంటారు. తాజాగా అఖిల్‌తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కూడా అటువంటిది. ఈ చిత్రం ట్రైలర్ గురువారం రాత్రి హైదరాబాద్‌లోని సినీమేక్స్‌లో విడుదలైంది. ప్రేమ, కెరీర్, పెళ్లి చుట్టూ అన్ని అంశాలు ముడిపెడుతూ ఎమోషనల్ జర్నీగా ట్రైలర్ సాగింది. ఈ సందర్భంగా లవ్ కథలు బాగా ఆవిష్కరిస్తారని ప్రస్తావన రాగా, తనకు లవ్ సినిమాలు రాయడం తెలీదు. లైఫ్ గురించి తెలుసు. అందులో భాగంగానే లవ్ కూడా వుంటుందని క్లారిటీ ఇచ్చాడు.
ఈ సినిమా కథ గురించి మొదట నేను అనుకున్నది నచ్చదేమోనని అల్లు అరవింద్‌గారికి చెప్పాను. హీరోయిన్ స్టాండ్ అప్ కామెడీ చేస్తుంది. ఈ నేపథ్యంలో రాసుకున్నా. ఇది తెలుగులో కొత్తగా వుంటుంది. మరి దీనికి అల్లు అరవింద్‌గారు ఒప్పుకుంటారోలేదోనని అనుకుని కథ చెప్పాను. కథ విన్నాక వెంటనే సెట్‌కు వెళదాం అన్నారు అని బొమ్మరిల్లు భాస్కర్. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంట చూడముచ్చటగా వుంటుందని తెలిపారు. ఒక్కడైనా హీరో హీరోయిన్ల మధ్య ఎంటర్‌టైన్‌మెంట్ వుంటే అది తప్పకుండా హిట్టే. అలాంటి హిట్ సినిమా మాది అని అన్నారు. 2.04 నిమిషాల ట్రైలర్ అంతా చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు