దివంగత తమిళనటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.ఆర్. 104 జయంతి సందర్భంగా తలైవి సినిమా స్టిల్‌ను ఆదివారంనాడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. బయోపిక్‌లు బాగా ఆదరణ పొందుతున్న తరుణంలో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తీస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో కంగనా రనౌగ్ జయలలిత పాత్ర పోషిస్తోంది. అందుకు సంబంధించిన ఆమె స్టిల్స్ కూడా ఆమధ్య విడుదలయ్యాయి. 2019 నవంబర్ 10 న చిత్రీకరణ ప్రారంభమైంది. జయలలిత బయోపిక్‌లు పలు పేర్లతో పలువురు నిర్మిస్తున్నా.. తలైవి.. చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఎందుకంటే ఇందులో ఆమెకు రాజకీయ గురువు అయిన ఎం.జి.ఆర్. పాత్ర కీలకమైంది. ఆ పాత్రను అరవింద్ స్వామి పోషిస్తున్నారు. కాగా, ఎం.జి.ఆర్. 104వ జయంతి సందర్భంగా ఆదివారంనాడు ఇరువురి స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అరవింద్ స్వామి, కంగనా.. ఇద్దరూ ఎం.జి.ఆర్., జయలలిత లాగా ఇమిడి పోయారు. ఈ చిత్రాన్ని ఎ. ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.
కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సహకారంతో విబ్రీ మీడియా నిర్మించింది. హిందీ, తమిళ, తెలుగు భాషలలో రూపొందుతోంది. ఇందులో జానకి రామచంద్రన్‌గా మధుబాల, శశికలగా పూర్ణ, సంధ్యగా భాగ్యశ్రీ నటిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.