Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vijayashanti: తెలుగు హీరోలు బ్రాండ్ మైండ్ కాదు- ఈర్ష ఎక్కువ : విజయశాంతి

దేవీ
గురువారం, 5 జూన్ 2025 (16:52 IST)
Vijayashanti
తెలుగు హీరోల్లోచాలామంది ఆలోచనలు భిన్నంగా వున్నాయనీ, వారిల్లో అశాంతి, భయం, ఈర్ష ద్వేషాలు ఎక్కువగా వున్నాయని సీనియర్ నటి విజయశాంతి స్టేట్ మెంట్ ఇచ్చారు. మహేష్ బాబు సినిమాలో నటించిన తర్వాత ఈమధ్యే నందమూరి కళ్యాణ్ నటించిన సన్నాఫ్ వైజయంతి సినిమాలో పోలీస్ అధికారిగా నటించింది. తాజాగా మరో ప్రముఖ హీరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్బంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోల చుట్టూనే తిరిగింది.
 
యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చింది. మీ కెరీర్ మంచి ఫామ్ లో వుండగా, చిరంజీవి వంటి హీరోతో మీకు స్పర్థలు వచ్చాయనీ, కెరీర్ ను అడ్డుకున్నారనీ వార్తలు వచ్చాయి? అన్న ప్రశ్నకు విజయశాంతి సమాధానమిస్తూ, సినిమా రంగంలో పోకడలు చిత్రంగా వున్నాయి. బాలీవుడ్ లో అందరూ బ్రాండ్ మైండ్ తో వుంటారు. తెలుగులో రివర్స్ గా వుంటుంది.

ఎటువంటి హీరో అయినా ఆయనతో కలిసిన నటించినప్పుడు ఇంటిలో తమ సోదరి, కుటుంబ సభ్యులు గా చూడరు. తెలుగు హీరోలు బ్రాడ్ మైండ్ లేదు. ఈర్షా ద్వేషాలుంటాయి. మనతో నటించిన నటికి మంచి అవకాశాలు వస్తున్నాయి అంటే తట్టుకోలేరు. వారి ఆలోచనలు అలానే వుంటాయి. వారి కుటుంబసభ్యుల్లో ఆడవారుంటే పెండ్లి చేయాలనీ, మంచిగా వుండాలని కోరుకుంటారు. కానీ వారితో నటించిన నటి కూడా అలాగే వుండాలని కోరుకోరు. టాలీవుడ్ లో హీరోలు మారరు. మారే అవకాశం కూడా లేదు..అంటూ నిక్కచ్చిగా పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments