RT76 : రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం - 2026 సంక్రాంతికి రిలీజ్

దేవీ
గురువారం, 5 జూన్ 2025 (16:38 IST)
RT76 Raviteja new poster
మాస్ మహారాజా రవితేజ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ల మాస్టర్, దర్శకుడు కిషోర్ తిరుమలతో కలిసి RT76 ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. క్యాలిటీ, హై ఎంటర్ టైన్మెంట్ వాల్యూస్ తో సినిమాలని అందించడంలో పాపులరైన ప్రతిష్టాత్మక SLV సినిమాస్ బ్యానర్‌పై సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో రాబోయే ఈ చిత్రం ఈరోజు ముహూర్తపు వేడుకతో ఘనంగా ప్రారంభమైంది.
 
అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ వెరీ స్టైలిష్ అవతార్‌లో, డిజైనర్ సూట్ ధరించి కనిపిస్తున్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ సీటులో హాయిగా కూర్చున్న అతను, ముందు సీటుపై ఒక కాలు క్యాజువల్‌గా ఆనించి, ఒక చేతిలో వైన్ బాటిల్, మరో చేతిలో పుస్తకంతో కనిపించడం అదిరిపోయింది. ఇది ఇప్పటివరకు రవితేజ మోస్ట్ స్టైలిష్ లుక్‌ను సూచిస్తుంది. అతను పట్టుకున్న పుస్తకంలో "సీ ఇట్ & సే ఇట్" స్పానిష్‌లో ఉంది, ఇది అతని పాత్రపై ఆసక్తిని పెంచుతోంది. 
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ధమాకా కోసం చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించిన తర్వాత భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి రవితేజతో మళ్ళీ వర్క్ చేస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల డీవోపీగా పని చేస్తున్నారు. అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. AS ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్.
RT76 రెగ్యులర్ షూటింగ్ జూన్ 16 నుండి హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఈ చిత్రం 2026 సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారాస డమ్మీ అభ్యర్థిగా విష్ణువర్థన్ రెడ్డి

దీపావళి వేడుకలకు దూరంగా ఉండండి : పార్టీ నేతలకు హీరో విజయ్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments