Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాప్సి' కథానాయికగా 'గేమ్ ఓవర్' ప్రారంభం

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (21:47 IST)
ప్రముఖ కథానాయిక 'తాప్సి' ప్రధాన పాత్రలో 'గేమ్ ఓవర్' పేరుతో  ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ 'వై నాట్ స్థూడియోస్' ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో ఈ సంస్థ సిద్ధార్ధ్' కథానాయకునిగా రూపొందిన 'లవ్ ఫెయిల్యూర్' (2012), విక్టరీ 'వెంకటేష్' కథానాయకునిగా రూపొందిన 'గురు' (2017) వంటి ఘన విజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. ఇప్పుడు తమ మరో ప్రయత్నం గా తాప్సి' ప్రధాన పాత్రలో  ఈ 'గేమ్ ఓవర్' ను నిర్మించటాన్ని సంతోషంగా ప్రకటించింది. 'నయనతార' కథానాయికగా తమిళ నాట ఘనవిజయం సాధించిన 'మయూరి' వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు 'అశ్విన్ శరవణన్' దర్శకత్వంలో ఈ 'గేమ్ ఓవర్'  చిత్రాన్ని అభిరుచి కలిగిన నిర్మాత వై నాట్ స్థూడియోస్' అధినేత ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. 
 
ఈ 'గేమ్ ఓవర్' చిత్రం చెన్నై లో నేడు (అక్టోబర్ పదకొండు) ప్రారంభమయింది. ఓ సరికొత్త కధ, కథనాలతో తెలుగు,తమిళ భాషలలో ఏక కాలంలో నేటి నుంచి ఏక ధాటిగా ఆంద్ర,తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాలలోని పలు ప్రదేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది అని నిర్మాత ఎస్.శశికాంత్ తెలిపారు. 'లవ్ ఫెయిల్యూర్', 'గురు', విజయాల సరసన ఈ చిత్రం కూడా నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 
 
ఈ 'గేమ్ ఓవర్' చిత్రానికి సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్ , ఎడిటర్: రిచర్డ్ కెవిన్, రచన: అశ్విన్ శరవణన్,కావ్య రాంకుమార్, మాటలు: వెంకట్ కాచర్ల, ఛాయా గ్రహణం: ఎ.వసంత్, ఆర్ట్: శివకుమార్, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.కె.నందిని, పోరాటాలు: 'రియల్' సతీష్, సౌండ్ డిజైనర్: సచిన్ సుధాకరన్, హరిహరన్ (సింక్ సినిమా), స్టిల్స్: ఎమ్.ఎస్.ఆనందం, పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న, పి.ఆర్.ఓ. లక్ష్మి వేణుగోపాల్, వై నాట్ స్టూడియోస్ టీమ్: కంటెంట్ హెడ్: సుమన్ కుమార్, డిస్ట్రిబ్యూషన్ హెడ్:  కిషోర్ తాళ్లూరు, బిజినెస్ ఆపరేషన్స్: ప్రణవ్ రాజ్ కుమార్. ప్రొడక్షన్ ఎగ్జిక్యుటివ్స్: రంగరాజ్, ప్రసాద్ సోములరెడ్డి.లైన్ ప్రొడ్యూసర్: ముత్తురామలింగం, సహ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర, నిర్మాత: ఎస్.శశికాంత్, దర్శకత్వం: అశ్విన్ శరవణన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments