Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వామ్మో... తాప్సీ నిన్నలా చూడలేక చస్తున్నాం... నీ రోగం కుదర్చడానికే అలా పెట్టా, తాప్సీ

తాప్సీ. గ్లామర్ గురించి ఆమధ్య దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావును తీవ్రస్థాయిలో విమర్శించి ఆ తర్వాత వెనక్కి తగ్గింది. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. విషయం ఏమిటంటే... ఆమె జుడ్వా 2 చిత్రంలో బికినీ వేసి అందాలన్నీ ఆరబోసింది. అది చాలదన్నట్లు సోషల్ మ

Advertiesment
వామ్మో... తాప్సీ నిన్నలా చూడలేక చస్తున్నాం... నీ రోగం కుదర్చడానికే అలా పెట్టా, తాప్సీ
, మంగళవారం, 21 నవంబరు 2017 (12:02 IST)
తాప్సీ. గ్లామర్ గురించి ఆమధ్య దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావును తీవ్రస్థాయిలో విమర్శించి ఆ తర్వాత వెనక్కి తగ్గింది. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. విషయం ఏమిటంటే... ఆమె జుడ్వా 2 చిత్రంలో బికినీ వేసి అందాలన్నీ ఆరబోసింది. అది చాలదన్నట్లు సోషల్ మీడియాలో ఇష్టమొచ్చిన ఫోజుల్లో ఫోటోలను షేర్ చేసేస్తోంది. మరీ కురచ దుస్తులు వేసుకున్న ఓ ఫోటోను షేర్ చేయడంతో ఇక నెటిజన్లు కామెంట్లు షురూ చేశారు. 
 
వామ్మో... తాప్సీ నిన్నలా చూడలేక చస్తున్నాం.. అని కొందరు కామెంట్లు కొడితే మరికొందరైతే... ఇలా చూపించబట్టే మహిళ పట్ల మగాళ్లు ఆకర్షితులవుతున్నారంటూ వ్యాఖ్య చేశాడు. దీనికి తాప్సి సమాధానమిస్తూ... మగాళ్లకి వుండే ఇలాంటి రోగం కుదరడానికి, మహిళలను తప్పుగా చూసే ధోరణి పోవడానికి ఏదో ఒకటి చేయాలి కానీ ఇలాంటి ఫోటోలను చూస్తే ఏమీకాదు. 
 
నువ్వు మాత్రం ట్రీట్మెంట్ తీసుకో అంటూ పేర్కొంది. మరొక నెటిజన్... బట్టలు కొనుక్కునేందుకు డబ్బులు లేవా తాప్సీ అని ప్రశ్నించాడు. దీనిపై స్పందిస్తూ... ఈ ఫోటో పెట్టకపోతే వజ్రం లాంటి నీవు, నీ భావాలు తెలియవు కదా అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇవన్నీ చూసిన బాలీవుడ్ సెలబ్రిటీ వరుణ్ ధావన్... శభాష్ తాప్సీ అంటూ పొగడ్త విసిరాడు. మరి ఎవరిది కరెక్టో ఎవరిది తప్పో మీరే డిసైడ్ చేస్కోండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ర‌ణ్‌వీర్‌తో డేట్ చేస్తా.. సంజయ్‌ను పెళ్లాడతానంటున్న "పద్మావతి"