Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని రీమేక్ చేస్తారట...!

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (16:25 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన సినిమాల్లో "బ్రహ్మోత్సం" ఒకటి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో, కుటుంబ కథా చిత్రంగా రూపొందిన 'బ్రహ్మోత్సవం' మహేష్ అభిమానులను, ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. 
 
ఇప్పుడు ఈ కళాఖండాన్ని తమిళనాట రీమేక్ చేయబోతున్నాడు యాక్టర్ కమ్ డైరెక్టర్ చేరన్. ఇతడు గతంలో రవితేజ నటించిన "నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్" సినిమాని తమిళంలో తీసాడు. ఇటీవలే 'బ్రహ్మోత్సవం' సినిమా చూసిన చేరన్, ఆ మూవీని కోలీవుడ్‌లో రీమేక్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడట.
 
'బ్రహ్మోత్సవం' సినిమాలో అతనికి అంతబాగా ఏం నచ్చింది అని అడిగితే.. అందుకు చేరన్ ఆ సినిమాలో ఉన్న ఫ్యామిలీ ఎమోషన్ అని సమాధానం ఇచ్చాడు. తమిళ ప్రేక్షకుల అభిరుచికి ఈ స్టోరీ చాలా దగ్గరగా ఉందని, తమ నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు చేస్తే తప్పకుండా తమిళంలో మంచి విజయాన్ని సాధించడంతో పాటు, ఫీల్ గుడ్ మూవీగా నిలుస్తుందని చేరన్ ఈ మధ్య ఒక ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న బ్రహ్మోత్సవం తమిళ రీమేక్ త్వరలో పట్టాలెక్కనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments