ఒంటిమిట్టలో 18న కల్యాణోత్సవం.. జర్మన్ షెడ్లతో కల్యాణ వేదిక..

ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (11:03 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం నుంచి ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా, 18న రాత్రిపూట కల్యాణోత్సవం జరుగుతుంది. 
 
గత ఏడాది కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో కల్యాణోత్సవం వేళ, కురిసిన భారీ వర్షం, పందిళ్లు నేలమట్టమై, ప్రజలు ఇబ్బందులు పడిన నేపథ్యంలో.. ఈసారి అప్రమత్తమైన చర్యలు తీసుకున్నారు. కల్యాణ వేదికను సైతం మరింత పటిష్ఠంగా నిర్మిస్తున్నట్టు తెలిపారు. 
 
ఈ సంవత్సరం మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంత వర్షం వచ్చినా చెక్కుచెదరని జర్మన్ షెడ్లతో కల్యాణ వేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ కల్యాణోత్సవానికి దాదాపు లక్ష మంది వరకూ భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు లక్షల ముత్యాల తలంబ్రాలను టీటీడీ సిద్ధం చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాత్రంతా రూ.2కోట్లతో మస్తు మజా.. వరుసగా అమ్మాయిలను పిలిపించుకుని?