Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ అమ్మాయిలతో సెక్స్ రాకెట్.. పోలీసులకు చిక్కిన 'నల్ల రోజా'

వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతోనే కాదు విదేశాలకు చెందిన యువతులతో గుట్టు చప్పుడు కాకుండా సెక్స్ రాకెట్ నడుపుతూ వచ్చిన ఓ తమిళ నటి పోలీసులకు అడ్డంగా చిక్కిపోయింది. ఆమె పేరు సంగీత బాలన్ అలియాస్ నల్ల ర

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (09:05 IST)
వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతోనే కాదు విదేశాలకు చెందిన యువతులతో గుట్టు చప్పుడు కాకుండా సెక్స్ రాకెట్ నడుపుతూ వచ్చిన ఓ తమిళ నటి పోలీసులకు అడ్డంగా చిక్కిపోయింది. ఆమె పేరు సంగీత బాలన్ అలియాస్ నల్ల రోజా.
 
చెన్నై నగర శివారు ప్రాంతంలోని ఓ ప్రైవేటు రిసార్టులో ఈమె పలువురు అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సివిల్ దుస్తుల్లో వచ్చిన పోలీసులు... అక్కడకు చేరుకుని తనిఖీలు చేయారు. ఆ సమయంలో వ్యభిచారంలో నిమగ్నమైవున్న అమ్మాయిలను రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ కేసులో సురేష్ అనే మరో వ్యక్తితో పాటు పలువురు విటులను కూడా అరెస్టు చేశారు. 
 
పోలీసులకు చిక్కిన అమ్మాయిలంతా ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన అమ్మాయిలనీ, వారందరినీ చెన్నయ్‌లోని పునరావాస కేంద్రానికి తరలించామని పోలీసులు తెలిపారు. అలాగే నిందితులు సంగీత బాలన్, సురేష్‌లతో పాటు... విటులను అరెస్టు చేసి ఎగ్మోర్‌లోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచినట్టు తెలిపారు. 
 
కాగా, సంగీత బాలన్ 1996లో వచ్చిన తమిళ సినిమా 'కరుప్పు రోజా' ద్వారా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈమెకు నల్ల రోజా అనే పేరు కూడా ఉంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. ఆమె టీవీ సీరియళ్లలోనూ నటిస్తున్నారు. తెలుగులో "వాణి రాణి" చిత్రంలో ఈమె నటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం