Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంకర్ జీవితమంతా నాకు తెలుసు.. అతని గుట్టురట్టు చేస్తా... వడివేలు

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (10:27 IST)
వడివేలు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీపరిశ్రమలో బ్రహ్మానందంకు ఎంత క్రేజ్ ఉందో తమిళనాడులో ఒకప్పుడు వడివేలుకు అంతే క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ క్రేజ్ బాగా తగ్గిపోయింది. కారణం సినిమాలు లేకపోవడమే. అంతేకాదు కొంతమంది రాజకీయ పార్టీ నేతలను, సినీ ప్రముఖులను విమర్సిస్తూ చివరకు ఛాన్సులను పోగొట్టుకుంటున్నారు నటుడు వడివేలు.
 
తాజాగా ప్రముఖ దర్శకుడు శంకర్ గురించి వడివేలు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. తమిళ సినీపరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా వడివేలు చేసిన వ్యాఖ్యలే మారిపోతున్నాయి. శంకర్‌కు అసలు డైరెక్షన్ తెలియదు. శంకర్ ఒక గ్రాఫిక్ డిజైనర్ మాత్రమే. అతనికి అస్సలు డైరెక్షన్ తెలియదు.
 
నన్నేదో మాట్లాడుతున్నాడు శంకర్. అసలు అతనికి ఏం తెలుసు. ఎక్కువ మాట్లాడితే శంకర్ జీవిత చరిత్ర మొత్తం చదివేస్తా. అతని గుట్టు విప్పుతానంటూ చెలరేగిపోయాడు వడివేలు. శంకర్, వడివేలు ఒకప్పుడు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి పులకేసి అని సినిమాను తీశారు. అందులో 23వ పులకేసిగా వడివేలు నటించగా నిర్మాతగా శంకర్ సినిమాను చిత్రీకరించారు. అయితే ఆ సినిమా సమయంలో ఇద్దరి మధ్యా మనస్పర్థలు దారితీశాయి. అప్పటి నుంచి ఇద్దరూ కూడా ఇలాగే ఒకరిపై ఒకరు విమర్సలు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా వడివేలు చేసిన వ్యాఖ్యలే పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments