Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్ వయసులోనే ప్రేమించాను.. అపుడే బ్రేకప్ అయింది.. నటి తాప్సీ

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (08:20 IST)
సినీ నటి తాప్సీ తన ప్రేమ విషయాన్ని వెల్లడించింది. పాఠశాల వయసులోనే ప్రేమలో పడ్డాడని, అది అపుడే బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చింది. కానీ ఇపుడు మాత్రం ఎవరితోనూ ప్రేమలో పడలేదని తెలిపింది. 
 
అయితే, తన ప్రేమ బ్రేకప్‌ కావడానికి గల కారణాలను వెల్లడిస్తూ, నేను 9వ తరగతిలోనే ఉన్న సమయంలో ప్రేమలోపడ్డాను పదో తరగతిలో పబ్లిక్ పరీక్షలు రాస్తున్న సమయంలో నేను ప్రేమించిన అబ్బాయి వదిలేశాడు అని చెప్పింది. 
 
అపుడు ఏం చేయాలో తోచలేదు. పైగా, ఆ సమయంలో ఫోన్లు, గట్రాలు లేవు. అందుకే ఇంటి వెనుక ఉండే పబ్లిక్ ఫోన్‌బూతుకు వెళ్లి ప్రేమించిన యువకుడికి ఫోన్ చేసి నన్ను ఎందుకు వదిలివేశావ్ అంటూ వెక్కివెక్కి ఏడుస్తూ ప్రశ్నించేదాన్ని అని తెలిపింది. ఇపుడు ఆ నాటి సంఘటనలను తలచుకుంటే తనకు నవ్వు వస్తోందని ఆమె చెప్పుకొచ్చింది. 
 
ఆ తర్వాత ఇప్పటివరకు ప్రేమలో పడలేదని తెలిపింది. ముఖ్యంగా, తన ఆలోచనలకు తగినట్టుగా ఉండే వ్యక్తి దొరకాలని తెలిపింది. తాను ప్రేమించే వ్యక్తితో అభిప్రాయాలు కలవాలని తాను ప్రేమలో ఉన్నపుడు ఆ విషయాన్ని అందరికీ చెప్పేస్తానని వెల్లడించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

స్పా సెంటరులో వ్యభిచారం.. ఓ కస్టమర్.. ఇద్దరు యువతుల అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments