సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది. ప్రేమించిన ప్రియుడ్ని.. పెళ్ళి చేసుకున్న భర్తను కాదని వేరొకరితో పారిపోయింది ఒక మహిళ. నెల్లూరు జిల్లాలో సంఘటన జరిగింది.
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	నెల్లూరు జిల్లా కొరవకుట్లకు చెందిన 19 యేళ్ళ యువతిని అదే ప్రాంతానికి చెందిన గణేష్ ప్రేమించాడు. తల్లిదండ్రులకు తెలియకుండా ఆ యువతితో ఆరునెలల పాటు సహజీవనం చేశాడు గణేష్. అయితే ఆ విషయం తెలియని యువతి తల్లిదండ్రులు తమ బంధువుల అబ్బాయికి ఇచ్చి నెల రోజులకు ముందు వివాహం చేశారు. వివాహ సమయంలో అడ్డుచెప్పని యువతి రెండురోజులకే అత్తవారింటి నుంచి పారిపోయింది.
 
									
										
								
																	
	 
	ఆ తరువాత ప్రియుడి దగ్గరకు వెళ్ళి మరో పెళ్ళి చేసుకుంది. భర్త ఆ విషయాన్ని లైట్‌గా తీసుకొని భార్యను వదిలేశాడు. ప్రియుడిని పెళ్ళి చేసుకున్న యువతి ఐదు రోజుల పాటు అతనితో గడిపింది. అయితే గత కొన్నిరోజులుగా అక్కడ కూడా కనిపించకుండా పోయింది. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	అసలేం జరుగుతుందో తెలియక ప్రియుడు గణేష్ పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రియురాలిని అప్పజెప్పాలని పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గణేష్ ఉంటున్న ఇంటి పక్కనే మరో యువకుడితో మహిళ పరిచయం పెట్టుకుని అతనితో వెళ్ళిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.