Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగ్గురు ప్రియుళ్ళతో ఒక ప్రియురాలు డేటింగ్.. ఎక్కడ?

Advertiesment
ముగ్గురు ప్రియుళ్ళతో ఒక ప్రియురాలు డేటింగ్.. ఎక్కడ?
, గురువారం, 10 జనవరి 2019 (17:42 IST)
ప్రేమ పేరుతో మోసం చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కొంతమంది స్వచ్ఛమైన ప్రేమ కోసం ప్రాణమిస్తే మరికొందరు డబ్బుల కోసం కక్కుర్తిపడి ప్రేమను అపహాస్యం చేస్తున్నారు. అలాంటి సంఘటనే చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది.
 
పలమనేరు మండలపం బైరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒక 23 యేళ్ళ యువతి డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం కొన్ని కంపెనీలకు వెళ్ళింది. ఎక్కడా ఆమెకు ఉద్యోగం దొరకలేదు. తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించడంతో తాత వద్దే ఆ యువతి ఉంటోంది. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆ యువతి ఆలోచనలు పెడదారి పట్టాయి. డబ్బులు సులువుగా సంపాదించాలన్న ఆలోచనతో తనతో పాటు కళాశాలలో విద్యనభ్యసించిన ముగ్గురు స్నేహితులతో పరిచయం పెట్టుకుంది.
 
ముగ్గురిని ప్రేమించింది. ఒకరికి తెలియకుండా మరొకరితో డేటింగ్ చేసింది. అవసరాల నిమిత్తం వారి దగ్గర అప్పుడప్పుడు డబ్బులు తీసుకొని ఆర్థిక సమస్యను తగ్గించుకునే ప్రయత్నం చేసింది. నాలుగునెలల పాటు ఇలా సాగింది. తనతో పాటు కళాశాలలో చదువుకున్న మరో యువకుడు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా బాగా డబ్బులు సంపాదిస్తున్నాడని తెలుసుకుని అతనితోను పరిచయం పెట్టుకుంది. యువతి మాయమాటలు నమ్మి ఆమె వలలో పడిపోయాడు యువకుడు. 
 
తన గ్రామంలో ఉన్న ముగ్గురు యువకులను కలవడం తగ్గించేసింది. వారానికి రెండు రోజులు బెంగుళూరులోనే ఉండటంతో యువతితో ప్రేమాయణం నడుపుతున్న ముగ్గురికి అనుమానం వచ్చింది. అందులో ఇద్దరు లైట్ తీసుకోగా రంజిత్ అనే యువకుడు మాత్రం యువతిని ఫాలో చేసి అసలు విషయం తెలుసుకున్నాడు. యువతి తన స్వగ్రామానికి బయలుదేరిన తరువాత ఆ యువతి బండారం మొత్తాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు తెలిపాడు. దీంతో ఆ యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసం చేసి యువకుల నుంచి డబ్బులు వసూలు చేయడంతో యువతిని అదుపులోకి తీసుకున్నారు పలమనేరు పోలీసులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుమాస్తాలా పనిచేస్తున్నా.. సీఎంలా కానేకాదు.. కన్నీళ్లతో కుమారస్వామి