Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్వేత బసు ప్రసాద్ స్లిమ్ అయ్యిందట.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (14:12 IST)
''కొత్త బంగారు లోకం'' సినిమాతో వెండితెరకు పరిచయమైన శ్వీతా బసు ప్రసాద్.. ప్రస్తుతం స్లిమ్ అవ్వాలని చూస్తోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. దాంతో శ్వేతా బసుకి వరసగా రైడ్, కళావర్ కింగ్, కాస్కో సినిమాలలో అవకాశాలు వచ్చాయి.

అయితే ఈ సినిమాలన్ని అంతగా సక్సస్ సాధించకపోవడంతో శ్వేతా బసుకు సినిమాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంది. దాంతో ఇండస్ట్రీలో కొన్ని ఒడుదుడుకుల్ని ఎదుర్కొన్న శ్వేతబసు.. ఆపై వివాహం చేసుకుంది. 
 
కానీ పెళ్లి కూడా ఎక్కువకాలం సాఫీగా సాగకపోవడంతో భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు చుట్టుముట్టడంతో అవన్ని విడిపించుకొని మళ్ళీ సినిమా ప్రయత్నాలలో పడిందట. ఈ నేపథ్యంలోనే వర్కౌట్స్ చేసి మళ్ళీ నాజూగ్గా తయారైంది.

ప్రస్తుతం తన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా ప్రేక్షకులకి టచ్‌లో ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచుకునే ప్రయత్నాలలో ఉంది.  
 
అంతేకాదు తన లేటెస్ట్ ఫోటోస్ తో టాలీవుడ్ మేకర్స్‌కి మేనేజర్స్‌కి పంపించి ఏదైనా చిన్న అవకాశం ఇప్పించమని అడుగుతుందట. పనిలో పనిగా వెబ్  సిరీస్‌ల్లోనూ అవకాశాలు వస్తే చేస్తానంటోంది.

రాధికా ఆప్టే, కైరా అద్వానీల మాదిరిగా బోల్డ్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లలో హాట్ అండ్ గ్లామర్ రోల్స్ చేయడానికి అడల్ట్ కంటెంట్ ఉన్న వాటిలో నటించడానికి సిద్ధమని శ్వేతబసు ప్రసాద్ చెప్తుందట. మరి శ్వేతబసు ప్రసాద్‌‌కు అవకాశాలు వస్తాయా లేదా అనేది వేచి చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments