సమాధులప రామ మందిరాన్ని నిర్మిస్తారా అంటూ అయోధ్య నగర ముస్లిం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు వారు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ట్రస్టును ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ అధిపతిగా న్యాయవాది కె.పరాశరన్‌గా ఉన్నారు. ఈయనకు ముస్లిం ప్రజలు లేఖ రాశారు.
ఈ లేఖలో రామాలయ నిర్మాణం సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉందని ఆ లేఖలో ముస్లింలు ఆరోపించారు. ధ్వంసం చేయబడ్డ బాబ్రీ మసీదు ప్రాంతంలో ముస్లింల సమాధులు ఉన్నాయని, ఆ సమాధులపై రామాలయాన్ని నిర్మించడం సనాతన ధర్మానికి విరుద్ధమని ముస్లిం తరపున న్యాయవాది ట్రస్టుకు లేఖ రాశారు. ఈ లేఖను ఈ నెల 15వ తేదీన ట్రస్టుకు పంపారు.
1885లో జరిగిన అల్లర్లలో సుమారు 75 మంది ముస్లింలు చనిపోయారని, వారి సమాధులు అక్కడే ఉన్నాయని, బాబ్రీ మసీదు ప్రాంతాన్ని శ్మశానవాటికగా వాడారని, అలాంటి చోట రామాలయాన్ని ఎలా నిర్మిస్తారని ఆ లేఖలో ప్రశ్నించారు. ముస్లింల సమాధులపై రాముడి జన్మస్థాన ఆలయాన్ని నిర్మిస్తారా, ఇది హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తుందా అని, ట్రస్టు దీనిపై నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు.