Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#AYODHYAVERDICT అయోధ్యలో రాముని ఆలయం నిర్మించవచ్చు (video)

#AYODHYAVERDICT అయోధ్యలో రాముని ఆలయం నిర్మించవచ్చు (video)
, శనివారం, 9 నవంబరు 2019 (11:37 IST)
దేశ వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తూ వచ్చిన అయోధ్యపై సుప్రీం కోర్టు తుది తీర్పును ఇచ్చింది. జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది.

సీజేఐ గొగొయ్ అయోధ్యపై తీర్పును చదివి వినిపించారు. గొగొయ్ తన తీర్పులో ఏ విషయాన్ని నమ్మకంపై నిర్ధారించడం కుదరదని.. అయోధ్యలో ఇస్లామిక్‌కు ఐదు ఎకరాల స్థలం కేటాయించాలన్నారు. అంతేగాకుండా అయోధ్యలో రామాలయాన్ని కూడా నిర్మించనచ్చునని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. 
 
రాముడు అయోధ్యలోనే జన్మించాడనే అంశం నిర్వివాదాంశమని రంజన్ గొగొయ్ అన్నారు. రాముడు అయోధ్యలో పుట్టాడని ముస్లింలు కూడా అంగీకరిస్తారని సీజేఐ తెలిపారు. ప్రాథమిక విలువలు, మత సామరస్యాన్ని ప్రార్థనా మందిరాల చట్టం పరిరక్షిస్తుంది. రాజకీయాలు, చరిత్రకు అతీతంగా న్యాయం వుండాలని సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ అన్నారు. 
 
అయోధ్య కేసుకు అధికరణం 47వర్తించదని సీజేఐ రంజన్ గొగొయ్ అన్నారు. అయోధ్య తీర్పును చదివి వినిపించిన ఆన న్యాయమూర్తి ఆదేశాలు వున్నప్పుడే 47వ అధికరణం వర్తిస్తుంది. 12 ఏళ్ల తర్వాత సున్నీ వక్ఫ్ బోర్డు వ్యాజ్యం దాఖలు చేసింది.
 
మొఘలలు సమయం నుంచి హక్కు ఉన్నట్లు వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయింది. శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేసినట్లు మాత్రమే ఆధారాలు సమర్పించింది. లోపల ముస్లింలు, బయట హిందువులు ప్రార్థనలు చేసేవారని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్య తీర్పు: హిందువులదే రామజన్మభూమి- సుప్రీంకోర్టు