Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వార్త విని నా గుండె పగిలిపోయింది.. సురేఖా వాణి

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (14:43 IST)
టాలీవుడ్ క్యూట్ కపుల్స్ నాగ చైతన్య - సమంతలు తమ వైవాహిక బంధాన్ని తెంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. దీనిపై అనేక మంది సినీ సెలెబ్రిటీలు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదే పోస్ట్ పంచుకున్న సినీ నటి సురేఖా వాణి.. నాగ చైతన్య- సమంత విడిపోతున్నారనే వార్త తెలిసి గుండె పగిలిందంటూ ఎమోషనల్ అయ్యారు. ఇలా జరగకుండా ఉండాల్సింది అని బాధాత‌ప్త హృద‌యంతో పేర్కొంది.
 
కాగా, 'ఏ మాయ చేశావే' సినిమా షూటింగ్ సమయంలో వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌ చిగురించ‌గా, దాదాపు ఏడేళ్లపాటు కొనసాగింది. చివరకు ఇరు కుటుంబాల అంగీకారంతో 2017లో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. 
 
అక్టోబ‌ర్ 6,7 తేదీల‌లో హిందూ, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయాల ప్ర‌కారం వీరి వివాహం జ‌ర‌గ‌గా, అప్ప‌ట్లో వీరి పెళ్లి ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వీరిద్ద‌రు ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలుస్తారు అనుకున్న స‌మ‌యంలో అక్టోబ‌ర్ 2 మ‌ధ్యాహ్నం తాము విడాకులు తీసుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రికి షాక్ ఇచ్చారు.
 
దీనిపై నాగార్జున కూడా రియాక్ట్ అవుతూ.. 'బరువెక్కిన గుండెతో ఈ విషయం మీతో చెబుతున్నా. ఇలా జరగడం చాలా దురదృష్టకరం. భార్యభర్తలైన చై- సామ్ మధ్య జరిగింది పర్సనల్. ఆ ఇద్దరూ నాకు ఎంతో ప్రియమైన వారు. నేను, నా ఫ్యామిలీతో కలిసి సమంతతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వారిద్దరికి బలం చేకూర్చాలని ఆ దేవుడిని కోరుతున్నాను' అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైనా చెవులు పట్టుకుని చుక్కలు చూపించిన గాడిద.. వీడియో వైరల్ (Video)

బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు ఆయనేనా?

AP State Budget 2025-26: Highlights: ఏపీ బడ్జెట్.. సూపర్ సిక్స్‌కు పెద్దపీట.. బడ్జెట్ హైలైట్స్ ఇవే

బయట ఆడుకుంటున్న చిన్నారి - అపహరించి అఘాయిత్యం - ప్రైవేట్ భాగాలపై 28 కుట్లు!

AP Budget 2025-26: ఏపీని ముంచేసిన వైకాపా.. బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ ఫైర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments