మోసం చేసిన వారు ఎప్పుడూ బాగుపడరు... సిద్ధార్థ్

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (13:16 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన క్యూట్ కపుల్ నాగ చైతన్య, సమంతలు తమ వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాఫ్ పెడుతున్నట్టు శనివారం అధికారికంగా ప్రకటించారు. దీనిపై టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ ఓ ట్వీట్ చేశారు. ఇది ఇపుడు వైరల్ అవుతోంది. స‌మంత పేరును ప్ర‌స్తావించ‌కుండా ఆయ‌న ఈ ట్వీట్ చేశాడు. 'పాఠ‌శాల‌లో మా టీచర్ నేర్పిన తొలిపాఠం ఇది.. మోసం చేసేవారు ఎప్పుడూ బాగుపడరు' అని సిద్థార్థ్ అన్నాడు.
 
నాగ‌ చైత‌న్య‌, స‌మంత పెళ్లి చేసుకోక‌ముందు రోజుల‌ను గుర్తు చేసుకుంటూ సిద్ధార్థ్ ఇలాంటి వ్యాఖ్య చేశార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌ళ్లీ స‌మంత‌, సిద్ధార్థ్ క‌ల‌వాలంటూ ఒక‌రు కామెంట్ చేశారు. నాగ‌ చైత‌న్య, సమంత విడిపోతే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తావా? అంటూ మ‌రికొంద‌రు చివాట్లు పెడుతున్నారు. అప్ప‌ట్లో సిద్ధార్థ్‌, స‌మంత క‌లిసి తిరిగిన రోజుల‌ను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. 
 
కాగా, స‌మంత కూడా నిన్న 'కొన్నిసార్లు వాళ్లే గెలవొచ్చు... కానీ చివరికి వాళ్లే పతనమవుతారు. దీన్ని నేనెప్పుడూ నమ్ముతుంటాను' అంటూ ఓ పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఆమె ఎవ‌రిని ఉద్దేశించి పోస్ట్ చేసిందో కూడా తెలియ‌క నెటిజ‌న్లు తిక‌మ‌కప‌డుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తరాంధ్ర.. శ్రీకాకుళంకు కొత్త విమానాశ్రయం.. రెండు రోజుల్లోనే రూ.13లక్షల కోట్లు

Vangaveeti: వంగవీటి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఆశా కిరణ్?

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments