అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

సెల్వి
బుధవారం, 12 నవంబరు 2025 (11:39 IST)
టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియాలో వివరణ విడుదల చేశారు. తన వ్యాఖ్యలు నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను కించపరచడానికి ఉద్దేశించలేదని ఆమె పేర్కొన్నారు. నాగార్జున గారికి సంబంధించి నేను చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నాను. నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టడానికి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా వ్యాఖ్యలు నాగార్జున కుటుంబ సభ్యులను బాధపెట్టి వుంటే.. అందుకు చింతిస్తున్నాను.. అంటూ కొండా సురేఖ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేశారు.
 
కొంతకాలం క్రితం బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ... అక్కినేని నాగార్జున కుటుంబంపై, ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు నాగార్జున తీవ్రంగా స్పందించారు. ఆమెపై పరువు నష్టం దావా కూడా వేశారు. మరోవైపు నాగచైతన్య, సమంత సైతం తమ విడాకులు పరస్పర అంగీకారంతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని, తమ పేర్లను అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు.ఈ పరిణామాల నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

ఏబీసీ క్లీన్‌టెక్, యాక్సిస్ ఎనర్జీతో రూ. 1,10,250 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

దీని గురించి మీకు తెలియదు.. దగ్గరికి రాకండి.. భార్యను నడిరోడ్డుపైనే చంపేసిన భర్త (video)

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments