బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్ అని పేరు కొట్టేసిన దివ్వెల మాధురి.. బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన రోజు నుంచి తాను గేమ్ ఆడేందుకు వచ్చానే తప్ప బాడింగ్స్ కోసం కాదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో ఆమెను హౌస్ మేట్స్ ఫైర్ బ్రాండ్ అని పిలిచారు. ఎవరితోనైనా నేరుగా మాట్లాడటం.. తన అభిప్రాయం మొఖంపై చెప్పేసేది. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో కాస్త స్పెషల్‌గా నిలిచింది.
ఈసారి పేరున్న సెలెబ్రిటీలు హౌస్‌లో లేకపోవడంతో కాస్త నత్తనడకన నడుస్తున్న ఈ షోకు దివ్వెల మాధురి కాస్త అట్రాక్షన్‌గా నిలిచిందనే చెప్పాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి ప్రవేశించి, తన దూకుడు ప్రవర్తనతో అందరి దృష్టినీ ఆకర్షించింది దివ్వెల మాధురి.
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి ప్రవేశించి, తన దూకుడు ప్రవర్తనతో అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే.. ఈ ఫైర్ బ్రాండ్ ఊహించని విధంగా ఎలిమినేట్ అవడం షాక్ కలిగించింది. మొదట తానూజ "నాకు బాండింగ్ అవసరం లేదు" అని చెప్పినా, మాధురి ఆమెకు మరింత దగ్గరవుతూ వ్యూహాత్మకంగా ఆడింది.
ఈ వారం ఎలిమినేషన్‌లో మాధురి, గౌరవ్ మధ్య ఉత్కంఠ భరిత పోటీ నెలకొంది. నీ సేవింగ్ పవర్‌ను మాధురిపై వాడాలనుకుంటున్నావా? అని తనూజను నాగార్జున అడిగినప్పుడు లేదు సార్ అని ఒక్క మాటలో చెప్పింది. ఈ సమాధానం హౌస్‌లోని అందరినీ షాక్‌కు గురి చేసింది. మాధురి, తనూజపై నమ్మకం ఉంచి ఆఖరి వరకూ తనను సేవ్ చేస్తుందనే ఆశ పెట్టుకుంది మధూరి.
కానీ, తనూజ తీసుకున్న ఈ నిర్ణయం ఆమె మాస్టర్ మైండ్ గేమ్ అని నిరూపించింది. ఇక మాధురి ఎలిమినేషన్ తర్వాత సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు ఆమె నిజాయితీకి, ధైర్యానికి మద్దతు ఇస్తుంటే, మరికొందరు ఆమె అగ్రెసివ్ నేచర్ వల్లే ఎలిమినేట్ అయ్యిందని అంటున్నారు. కానీ, ఒక విషయంలో మాత్రం అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దివ్వెల మాధురి బిగ్ బాస్ 9 సీజన్‌లో అత్యంత గుర్తింపు పొందిన కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచారు అనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మాధురి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న మూడు వారాల వ్యవధిలో వారానికి రూ. 3 లక్షలు వరకు పారితోషికం అందుకున్నారని సమాచారం. మొత్తం మీద ఆమె రూ. 9 లక్షలు వరకు సంపాదించినట్లు తెలుస్తోంది.