Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

Advertiesment
Ravi Teja, Ashika Ranganath

చిత్రాసేన్

, సోమవారం, 3 నవంబరు 2025 (18:40 IST)
Ravi Teja, Ashika Ranganath
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో హోల్సమ్ ఎంటర్‌టైనర్ #RT76 చేస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను బిగ్ కాన్వాస్‌పై స్టైలిష్‌గా రూపొందిస్తున్నారు.
 
ఈ రోజు నుంచి హీరో రవితేజ, హీరోయిన్ ఆషికా రంగనాథ్ పై మూవీ టీం ఒక పాటను చిత్రీకరిస్తోంది. ఈ పాట కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకమైన సెట్‌ వేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందుతున్న ఈ పాట అదిరిపోయే డ్యాన్స్ నంబర్‌గా ప్రేక్షకులను అలరించనుంది.
 
ఎలక్ట్రిక్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించే రవితేజ ఈ సినిమాలో న్యూ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఇది హ్యూమర్, ఎమోషన్, రవితేజ మాస్ ఎలిమెంట్స్‌ తో ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది.
 
ఎమోషనల్ కథలతో అలరించే దర్శకుడు కిశోర్ తిరుమల ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు.
 
ఈ సినిమాకి సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ  ప్రసాద్ మూరెళ్ళ. నేషనల్ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?