నటీనటులు: రవితేజ- శ్రీలీల- నవీన్ చంద్ర- రాజేంద్ర ప్రసాద్- మురళి శర్మ- నరేష్- సముద్రఖని- నితిన్ ప్రసన్న- హైపర్ ఆది- అజయ్ ఘోష్ తదితరులు
సాంకేతికత: ఛాయాగ్రహణం: విధు అయ్యన్న, మాటలు: నందు సవిరిగామ, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాతలు: నాగవంశీ సాయి సౌజన్య కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: భాను భోగవరపు.
కథ:
తల్లిదండ్రులు చిన్నతనంలో కోల్పోవడంతో తాత రాజేంద్రప్రసాద్ అన్నీ తానే అయి లక్ష్మణ్ భేరి (రవితేజను) పెంచుతాడు. పోలీస్ అవ్వాలనే కోరిక వున్నా మామూలు పోలీస్ వద్దు. రైల్వే పోలీస్ అవ్వమని చెబుతాడు. ముక్కుసూటి మనస్త్వం గల లక్మణ్ వరంగల్ లో ఎస్.ఐ.గా చేరి ఎంఎల్.ఎ. కొడుకు అరాచకాలకు అడ్డు కట్టవేస్తాడు. కట్ చేస్తే.. ట్రాన్ ఫర్ మీద కోండమీద వుండే ఓ గ్రామ పరిధిలో పోస్టింగ్ కు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున గంజాయి వ్యాపారం చేసే శివుడు (నవీన్ చంద్ర)తో అతడికి ఘర్షణ మొదలవుతుంది. ఆ ఘర్షణ ఎటువైపు దారితీసింది? తర్వాత జరిగిన కథ ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
రవితేజ సినిమాలకు కావాల్సిన అంశాలు ఇందులో వున్నాయి. వయస్సు తో సంబంధం లేేకుండా చాలా ఎనర్జీతోనే నటించాడు. మనవడి పెండ్లి కాకుండా అబద్దాలతో తాత సన్నివేశాలు కొత్తగా అలరిస్తాయి. శ్రీలీల, సీనియర్ నరేష్ పాత్రలలో ట్విస్ట్ వుంది. మాస్ సినిమా అంటే ఇలానే వుండాలనే ఫార్మెట్ లో సాగుతుంది. సీరియస్ సన్నివేశం తర్వాత పాట రావడం వంటివి అలాంటివే.
- ఈ సినిమాలో చాలా అంశాలు టచ్ చేశారు. ముఖ్యంగా ఒక హీరో ఫ్యాన్స్ మరో హీరో ఫ్యాన్స్ గొప్ప అంటూ సోషల్ మీడియాలో రాజేంద్రప్రసాద్ చాటింగ్ చేస్తూ.. పనీపాటలేని వాళ్ళు చేసే పనులంటూ రకరకాల డైలాగ్స్ లో సెటైర్ గా తీశారు.
- అదేవిధంగా సెకండాఫ్ లో వచ్చే మాస్ సాంగ్ కూడా... ఈ పాటకు రిథమ్ లేదు. సంగీతం లేదు... పాటే కాదు.. కథ లేదు.. పబ్లిసిటీ చేస్తే లాభంలేదు... రివ్యూ వర్లను టచ్ చేస్తూ.. మౌత్ టాక్ తోనే సినిమా హిట్.. సూపర్ హిట్ అంటూ... బాగా ఆలోచించి రాశారు.
- ఈ సినిమాలో పై రెండు ప్రదానమైన అంశాలుగా కనిపిస్తాయి. ముఖ్యంగా మామూలు పోలీస్ గా సొసైటీలోని తప్పుడు పనులుచేసే వారిని అరికట్టలేం. అందుకే రైల్వే పోలీస్ గా వున్న వ్యక్తిచేత చేయించే అధికారిగా సముద్రఖని డైలాగ్ లే అసలు సినిమా కథ.
- ఇక మాఫియాను ప్రక్షాళన చేయాలంటే వారిలో ఒకడిగా పోలీస్ ఇన్ ఫార్మర్లను నియమించడం చాలా సినిమాల్లోనూచూశాం. కానీ వారి జీవితానికి భద్రత లేదు. అలాంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్త అని కూడా దర్శకుడు టచ్ చేశాడు.
- ఈ సినిమాలో విలన్ మామయ్య బంధువులు చేేసే ఫైట్ ప్రత్యేక ఆకర్షణగా వుంటాయి. భీమ్స్ చేసిన నేపథ్య సంగీతం మరో ఆకర్షణ. విలన్ గా నవీన్ చంద్రకు ప్లస్ అయ్యే సినిమా ఇది.
- సామజవరగమనతో రచయితగా సత్తా చాటుకుని మాస్ జాతర తో దర్శకుడిగా మారిన భాను భోగవరపు చేసిన తొలి ప్రయత్నం సాహసమే. హీరో ఎలివేషన్లు-యాక్షన్ సీక్వెన్సులు కాకుండా ఎక్కువగా కామెడీ మీదే సినిమాను నడిపించాలని చూశాడు భాను. కానీ నవ్వులు మాత్రం పండలేదు. లేటు వయసులో మనవడిని చికాకు పెడుతూ రొమాంటిక్ వేషాలు వేసే రాజేంద్ర ప్రసాద్ తో చేయించిన కామెడీ కనీస స్థాయిలో కూడా నవ్వించలేకపోయింది. సినిమా అంతా రొటీన్ అయినా.. ఈ ఒక్క ట్రాక్ సినిమాలో కొత్తగా.. క్యూరియస్ గా అనిపిస్తుంది. ఒక డెబ్యూ డైరెక్టర్ నుంచి ఆశించే స్పార్క్ అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే.. ఇది ఫ్యాన్స్ కు ఫిదా అయ్యే సినిమా.