Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

Advertiesment
Allu Sirish

సెల్వి

, శనివారం, 1 నవంబరు 2025 (11:21 IST)
Allu Sirish
నటుడు అల్లు శిరీష్, అతని చిరకాల స్నేహితురాలు నయనిక రెడ్డిల నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వార్తను అల్లు శిరీష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ మేరకు వారి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో శిరీష్, నయనిక హ్యాపీ మూమెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఈ సందర్భంగా, శిరీష్ తెల్లటి షేర్వానీలో, నయనిక అద్భుతమైన ఎరుపు రంగు లెహంగాలో అబ్బురపరిచింది. ఫోటోలను షేర్ చేస్తూ, శిరీష్ తన పోస్ట్‌కి నేను చివరకు.. సంతోషంగా నా జీవితంలోని ప్రేమతో నిశ్చితార్థం చేసుకున్నాను, నయనకా అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్‌తో అల్లు శిరీష్‌‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
webdunia
Allu Sirish
 
శుక్రవారం జరిగిన ఈ నిశ్చితార్థం సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ సభ్యులు ఈ వేడుకలో సందడి చేశారు. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ తన తాత, దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నిశ్చితార్థం చేసుకుంటానని ముందుగా ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి