Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

Advertiesment
kasturi

ఠాగూర్

, శుక్రవారం, 31 అక్టోబరు 2025 (18:39 IST)
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునపై సీనియర్ నటి కస్తూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీనేజ్ నాగార్జున అంటే తనకు అమితమైన పిచ్చి ప్రేమ అన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఒకపుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన కస్తూరి.. ఇపుడు టీవీ షోలు, సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. అలాగే, రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ టాక్‌ షోలో మాట్లాడుతూ, కింగ్ నాగార్జునపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా టీనేజ్ నాగార్జున అంటే ఎంత పిచ్చి ప్రేమ ఉండేదో వివరిస్తూ ఆమె చెప్పిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
'నేను చదువుకునే రోజుల్లోనే నాగార్జున గారంటే విపరీతమైన ఇష్టం. ఒకసారి ఆయన్ను కలిసే అవకాశం వచ్చింది. ఆయన వేసుకున్న షర్ట్ కలర్ కూడా నాకు ఇంకా గుర్తుంది. ఆయనతో షేక్ హ్యాండ్ చేశాక, ఆ చేయిని రెండు రోజుల పాటు కడగలేదు. 'ఇది నాగార్జున టచ్ చేసిన చేయి' అంటూ స్నేహితులకు చూపించి మురిసిపోయేదాన్నిట' అని కస్తూరి నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. ఆమె మాటలకు యాంకర్ కూడా ఆశ్చర్యపోయారు.
 
అనంతరం, 'మా జనరేషను ఆయన కేవలం హీరో మాత్రమే కాదు, ఓ పెద్ద క్రష్. ఇప్పటికీ ఆయనలో ఆ యంగ్ లుక్, చార్మ్ ఏమాత్రం తగ్గలేదు' అంటూ నాగార్జునను ఆకాశానికెత్తేశారు. 'నాగార్జునతో రొమాంటిక్ సీనులో నటించే అవకాశం వస్తే చేస్తారా?' అని యాంకర్ అడగ్గా, 'అది బెస్ట్ థింగ్. అలాంటి అవకాశం వస్తే వదులుకుంటానా? ఆయన చాలా ప్రొఫెషనల్, జెంటిల్మెన్. ఆయనతో నటించడం ఏ హీరోయిన్‌కైనా సౌకర్యంగా ఉంటుంది. నేను ఎప్పుడూ సిద్ధమే' అని స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం