Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీధి కుక్క చేతిలో చిరుత పులి ఘోర పరాజయం, 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది (video)

Advertiesment
Leopard defeat at the hands of a stray dog

ఐవీఆర్

, శనివారం, 23 ఆగస్టు 2025 (19:26 IST)
వీధి కుక్కల గురించి దేశంలో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వీధి కుక్కల సంఖ్య దేశంలో విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చిన్నారులు ఒంటరిగా రోడ్లపై నడిస్తే చాలు దాడి చేసి చంపేస్తున్నాయి. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు వీధి కుక్కల అదుపునకు ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
మహారాష్ట్ర లోని నాశిక్ లో జనావాసాల్లోకి వచ్చిన చిరుత పులిని ఎదుర్కొంది ఓ వీధి కుక్క. రోడ్డు పైకి వచ్చి నడుస్తూ వెళ్తున్న చిరుతపులిపై వీధి కుక్క ఒక్కసారిగా దూకింది. రెండూ కొద్దిసేపు పరస్పరం దాడి చేసుకున్నాయి. చివరికి వీధి కుక్క విజయం సాధించింది. చిరుతపులి మెడను పట్టుకుని 300 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. కాగా చిరుతపులికి తీవ్ర గాయాలైనట్లు అటవీశాఖ అధికారులు తెలియజేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Heavy Rains Lash Chennai: చెన్నైని కుమ్మేసిన భారీ వర్షాలు.. కరెంట్ తీగను తొక్కి కార్మికురాలు మృతి