Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రయాణికుడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన సెల్‌ఫోన్ దొంగతనం

Advertiesment
thane passenger leg injury

ఠాగూర్

, సోమవారం, 4 ఆగస్టు 2025 (14:25 IST)
మొబైల్ ఫోన్ చోరీ కారణంగా ఓ ప్రయాణికుడి జీవితం ఛిన్నాభిన్నమైంది. కదులుతున్న రైలులో నుంచి కిందపడటంతో అతడి కాలు రైలు చక్రాల కింద నలిగిపోయింది. దీంతో ఆ ప్రయాణికుడు కాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. తాజగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
థానే జిల్లాకు చెందిన గౌరవ్ నికమ్ అనే వ్యక్తి ముంబై లోకల్ రైలులో ప్రయాణిస్తున్నాడు. రద్దీగా ఉండటంతో రైలు డోర్ దగ్గరే నిలబడి ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన ఓ దొంగ, అతడి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను ఒక్కసారిగా లాక్కున్నాడు. ఈ హఠాత పరిణామంతో గౌరవ్ నికమ్ అదుపుతప్పి కదులుతున్న రైలులో నుంచి కిందకు జారిపడ్డాడు. 
 
అయితే, దురదృష్టవశాత్తు అతడి కాలు రైలు పట్టాలపై పడటంతో, రైలు చక్రాలు దానిపై నుంచి వెళ్లాయి. ఈ ప్రమాదంలో అతడి కాలు నుజ్జునుజ్జయింది. ప్రమాదాన్ని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది, తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న గౌరవ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
 
ముంబై లోకల్ ట్రైన్లలో ఇలాంటి సెల్ ఫోన్ దొంగతనాలు సర్వసాధారణంగా మారాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డోర్ల వద్ద నిలబడిన వారిని లక్ష్యంగా చేసుకుని దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. రద్దీని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నా, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో రైళ్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని రైల్వే పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఫ్యామిలీ మాస్ సూసైడ్..