Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Srileela : రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో అలరించిన హుడియో హుడియో..గీతం

Advertiesment
Ravi Teja and Srileela

చిత్రాసేన్

, బుధవారం, 8 అక్టోబరు 2025 (14:35 IST)
Ravi Teja and Srileela
మాస్ మహారాజా.. రవితేజ.. మాస్ జాతర చిత్రం నుండి మూడవ గీతం హుడియో హుడియో విడుదలయింది. రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో అలరించినట్లుగా వుందని చిత్ర యూనిట్ చెబుతోంది. దేవ్ రచించిన సాహిత్యం ఉల్లాసంగా, ఆకర్షణీయంగా ఉండి, శ్రావ్యమైన మాధుర్యంగా వుంది.
 
హుడియో హుడియో గీతాన్ని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో శ్రావ్యంగా మరియు హుషారుగా ఉండేలా తనదైన శైలిలో అద్భుతంగా స్వరపరిచారు. మాస్ చిత్రానికి తగ్గట్టుగా ఓ సరికొత్త మెలోడీని అందించారు. ఈ సంగీత మాయాజాలానికి తోడు, సంగీత సంచలనం హేషమ్ అబ్దుల్ వహాబ్ తన మనోహరమైన స్వరంతో భీమ్స్‌తో కలిసి ఈ గీతాన్ని ఆలపించారు. ఇది ఒక చిరస్మరణీయ సంగీత అనుభవాన్ని సృష్టించింది.
 
చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'తు మేరా లవర్', 'ఓలే ఓలే' గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో ఉర్రూతలూగించాయి. తాజాగా చిత్ర బృందం, మూడవ గీతంగా 'హుడియో హుడియో' అనే సరికొత్త మెలోడీని ప్రేక్షకులకు అందించింది. మాస్ మరియు మెలోడీని అందంగా మిళితం చేసిన ఈ మనోహరమైన ట్యూన్, అందరినీ కట్టిపడేస్తోంది. ఈ గీతం సినిమా  ఆల్బమ్ రెండింటికీ సరైన భావోద్వేగ లయను తాకుతుంది.
 
ఇప్పుడు శ్రోతల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకునే ఓ మంచి మెలోడీతో వచ్చారు. మునుపటి మాస్ మహారాజా రవితేజను తిరిగి తీసుకొని వస్తున్నట్టుగా మాస్-క్లాస్ కలిసిన ఆరా ఇందులో కనిపిస్తోంది. ఇక శ్రీలీల మరోసారి తెరపై వెలుగులు వెదజల్లారు. రవితేజ-శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఈ అందమైన గీతానికి మరింత అందాన్ని తీసుకొని వచ్చింది.
 
రచయితగా పనిచేసిన భాను భోగవరపు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 31న చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ పాత్ర కోసం సంప్రదించి.. రూ.3 కోట్లు ఆఫర్ చేశారు : మల్లారెడ్డి