Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి రజినీకాంత్ షాక్ : ఏ పార్టీకి మద్దతివ్వను.. తలైవా స్పష్టీకరణ

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (14:30 IST)
భారతీయ జనతా పార్టీతో పాటు అన్నాడీఎంకే సినీ స్టార్ రజినీకాంత్ తేరుకోలేని షాకిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓ ఒక్క పార్టీకి మద్దతు ఇవ్వబోనని స్పష్టం చేశారు. అలాగే, తమ పేరు, తమ పార్టీ పేరును ఏ ఒక్కరూ వాడుకోవడానికి వీల్లేదని వెల్లడించారు. ఇది ఆ రెండు పార్టీలకు పెద్ద ఎదురుదెబ్బగా భావించాలి. వచ్చే ఎన్నికల్లో రజినీని తమవైపునకు తిప్పుకోవాలని ఈ రెండు పార్టీలు భావించాయి. వాటికి చెక్ పెట్టేలా రజినీకాంత్ పిలుపునిచ్చారు. 
 
నిజానికి ర‌జ‌నీకాంత్ కొన్నాళ్ళ క్రితం తాను రాజ‌కీయాల‌లోకి అడుగుపెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు త‌న పార్టీ పేరు ప్ర‌క‌టించ‌ని ర‌జ‌నీకాంత్ రానున్న లోక్‌స‌భ ఎల‌క్ష‌న్స్‌లో పోటీ చేస్తాడా? లేదా? అనే దానిపై అభిమానుల‌లో ప‌లు సందేహాలు నెల‌కొన్నాయి. వీటిపై క్లారిటీ ఇచ్చారు. 
 
లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో తాను పోటీ చేయ‌న‌ని, ఏ పార్టీకి కూడా మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని ప్ర‌క‌టించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డ‌మే త‌మ ఉద్దేశ‌మ‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో వివ‌ర‌ణ ఇచ్చారు. "నా పేరు, గుర్తు ఎవ‌రు వాడ‌కూడ‌దు . స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించే బ‌ల‌మైన‌, సుస్థిర ప్ర‌భుత్వాన్ని ఎంచుకోండి" అని తలైవా పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల పరువునష్టం కేసు.. కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

గుమస్తా ఉద్యోగి నెల వేతనం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ

ఐదేళ్లలో మీరెంత తెచ్చారు? 14 నెలల్లో రూ. 45కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయ్: నారా లోకేష్

Byreddy Shabari: మహిళలు రాజకీయాల్లోకి వస్తారు.. ప్రత్యేక చట్టం కావాలి.. అలాంటి భాష వుండకూడదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments