Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

ఠాగూర్
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (17:23 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. నో పాలిటిక్స్ అంటూ వెళ్లిపోయారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం వేట్టయన్. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక శుక్రవారం రాత్రి జరిగింది. ఇందులో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం ఉదయం వైజాగ్ నుంచి చెన్నైకు విమానంలో రాగా, ఎయిర్ పోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు. 
 
తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ పేరును ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారనే వార్త ప్రచారంలో వుంది.. దీనిపై మీ కామెంట్ ఏమిటి? అని ఓ విలేకరి ప్రశ్నించగా 'పాలిటిక్స్ సంబంధించిన ప్రశ్నలు నన్ను అడగొద్దు, ఇబ్బంది పెట్టొద్దని మీకు ఇంతకు ముందే చెప్పానుగా' అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ రజనీకాంత్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డీఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తన కొడుకు ఉదయనిధి స్టాలిన్‌‍కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో గత కొంతకాలంగా జరుగుతోంది. ఈ విషయంపై ఉదయనిధి స్టాలిన్ కూడా 'ఇది పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారం, దీనిపై ముఖ్యమంత్రి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు' అని స్పందించారు. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ప్రభుత్వంలో క్రీడా శాఖామంత్రిగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments