Webdunia - Bharat's app for daily news and videos

Install App

#SarkaruVaariPaataతో ఆ రికార్డ్ బ్రేక్.. చిరును బీట్ చేసిన మహేష్ బాబు

Webdunia
శనివారం, 31 జులై 2021 (13:37 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 'సర్కారు వారి పాట' పేరుతో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఆడియో రైట్స్‌ను సరిగమ సౌత్ దక్కించుకుంది. అయితే ఈ ఆడియో రైట్స్ కోసం సరిగమ సౌత్ నాలుగున్నర కోట్లు చెల్లించుకుందట. 
 
ఇదే ఇప్పటి వరకు మన టాలీవుడ్లో ఒక నాన్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్‌లో అత్యధికం అన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే థమన్ ఇస్తున్న ఆల్బమ్‌పై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రం ఆల్బమ్ ఎలా ఉండనుందో చూడాలి. 
 
ఇక్కడ మరో విషయం ఏమంటే ఇప్పటి వరకు చిరంజీవి ఆచార్య ఆడియో రైట్స్‌ రికార్డ్ రేటుకు అమ్మడుపోయాయి. ఆచార్య ఆడియో రైట్స్ నాలుగు కోట్లకు అమ్మడుపోగా.. ఆ రికార్డ్‌ను మహేష్ బాబు సర్కారు వారి పాట బద్దలు కొట్టింది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది.
 
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. 
 
మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments